Finally Acharya Release Date Fixed : మొత్తానికి ఆచార్య విడుదల తేదీని ప్రకటించారు :-

Finally Acharya Release Date Fixed : టాలీవుడ్ సినిమాలోని మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి గారు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన సినిమా ఇది. ఈ సినిమా టీజర్ , సాంగ్ అభిమానులకు ఎంతగా నచ్చాయంటే రికార్డ్స్ కూడా బ్రేక్ చేసేసే స్థాయిలో కూర్చోబెట్టారు. అలాంటి ఆచార్య సినిమాకి విడుదల తేదీ కుదరక , ఎటువంటి అనౌన్స్మెంట్ చెయ్యకుండా అభిమానులకు నిరాశ కలిగిస్తూ వచ్చారు.
ఎపుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా మరియు ఆంధ్రప్రదేశ్ లోని టికెట్ రేట్స్ ఇష్యూ కారణంగా సినిమా విడుదల తేదీ ప్రకటించకుండా వాయిదా వేస్తూ వచ్చారు.
అయితే ముందుగా అక్టోబర్ లోనే విడుదలకి సిద్ధం అయింది. కానీ పోస్ట్ పోన్ చేసేశారు. గతం లో ఈ సినిమా విడుదల తేదిపై అనేకరమైన వార్తలు కూడా వచ్చాయి. ఈ సినిమా డిసెంబర్ 17 న పుష్ప కి పోటీగా విడుదల కాబోతుంది అని , మరికొందరు ఈ సినిమా జనవరి లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కి పోటీగా రాబోతుంది అని వార్తలు విపరీతంగా చిత్రసీమ లో టాక్ నడిచింది.
మొత్తానికి పుకార్లకు చెక్ పెట్టింది ఆచార్య చిత్రబృందం. ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు. ఆచార్య సినిమా ఫిబ్రవరి 4 , 2022 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వబోతుంది అని ప్రకటించారు. ఈ వార్త విన్నాక ఇతర సినిమాలు వారి వారి సినిమాల విడుదల తేదిని ఫిక్స్ చేసే పనిలో బిజీ అయిపోయారు.
ఎన్నో పుకార్లకు చెక్ పెట్టేసింది ఆచార్య చిత్ర బృందం. చూడాలి మరి ఈసారైనా అదే తేదీన విడుదల చేస్తారో లేదా అని వేచి చూడక తప్పదు.