Tollywood news in telugu

రథేరాకు సినీ ప్రముఖుల ప్రశంసలు !!!


పులా సిద్దేశ్వర్‌రావ్‌, మానస జంటగా, జకట రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రథేరా’. పూల సిద్దేశ్వర్‌ రావ్‌, నరేష్‌ యాదవ్‌, వై.ఎస్‌. కృష్ణమూర్తి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు జకట రమేష్‌ మాట్లాడుతూ, ‘ఖోఖో నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేసిన దర్శకులు వి.వి.వినాయక్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీజర్‌ చూసి అందరూ బాగుందంటున్నారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. నటీనటులంతా బాగా నటించారు. త్వరలో సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలను తెలియజేస్తాం’ అని అన్నారు. ‘మా సినిమాను కొందరు సినీ ప్రముఖులు చూసి బాగుందన్నారు. విడుదల తర్వాత ఆడియెన్స్‌ నుంచి కూడా అదే ఫీడ్‌ బ్యాక్‌ వస్తుందని నమ్ముతున్నాం. క్రీడా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్‌ సాధిస్తుంది. నూతన నటీనటులు అయినప్పటికీ అందరూ బాగా చేశారు. స్పోర్ట్స్‌ నేపథ్య సినిమాలు చాలా వరకు సక్సెస్‌ అవుతున్నాయి. అదే తరహాలోనే మా సినిమా కూడా సక్సెస్‌ అవుతుందని ఆశిస్తున్నాను’ అని హీరో సిద్దేశ్వరరావు తెలిపారు. ఎస్‌.కృష్ణమూర్తి, నరేష్‌ యాదవ్‌, మారుతి సకరం, రమాదేవి, మంజు, నాని, రాజేష్‌, సాయి, జానీ, కార్తీక్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్‌, కెమెరా: ఎడిటర్‌: కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రమేష్‌ జకట.

Read  మతులు పోగొడుతున్న కీర్తి సురేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button