Ferrari Car: రూ. 3 కోట్ల విలువైన ఫెరారీ కార్ ని సర్వీసింగ్ కోసం ఇస్తే…కారుకు యాక్సిడేటి చేసి పరార్ ఐన మెకానిక్ !

Ferrari Car: రూ. 3 కోట్ల విలువైన ఇటలీ, జెనోవా ఫుట్బాల్ ప్లేయర్ ఫెడెరికో మర్చెట్టి తన ఫెరారీ కారు కొన్నిరోజులుగా ఇబ్బంది పెడుతూ ఉంటె, రిపేర్ కోసమని సర్వీసింగ్ సెంటర్ కి ఇచ్చాడు. ఇచ్చిన కొన్ని గంటల్లోనే ‘ఫెడెరికో మర్చెట్టి‘ బ్యాడ్ న్యూస్ విన్నాడు. అదేంటంటే తన కార్ ప్రమాదానికి గురి అయిందని.
వివరాల్లోకెళితే.. ఫెడెరికో తన సూపర్ ఫాస్ట్ ఫెరారీ కారు ని సర్వీసింగ్ కోసం మెకానిక్కు ఇవ్వగా , మెకానిక్ ఆ కారును సర్వీసింగ్ చేసి తిరిగి ఫెడెరికోకు ఇవ్వడానికి బయలుదేరగా అనుకోకుండా కారు అదుపుతప్పి ప్రమాదానికి గురి అయింది.
ఈ కారు విలువ దాదాపుగా 3 కోట్లు ఉంటుంది. యాక్సిడెంట్ ఐన ఆ కారు పూర్తిగా ధ్వంసం అవగా మెకానిక్ మాత్రం అక్కడ కనపడకుండా పోవడంతో , పోలీసులు కార్ నంబర్ సహాయంతో ఫెడెరికో కు విషయం తెలియజేసారు.
కానీ ఈ విషయం తెలుసుకున్న కారు యజమాని ఫెడెరికో ఎంతో హుందాగా స్పందించాడు. అదేంటని కారులోని వ్యక్తిగాని , ఇతరులకు గాని ఏమి జరగకపోవడం సంతోషంగా ఉందని తలిపాడు. తన హుందాతనాన్ని ఫిదా ఐన అభిమానులు తనని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.