Today Telugu News Updates
సెల్ఫీ వీడియో తో మహిళా ఆత్మహత్య !

ఒక మహిళా సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ లో లాలాపేట లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే…. లాలాపేటకు చెందిన మంజుల 10 సంవత్సరాల క్రితం ఒక బేకరీ నడుపుతున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి తేజస్, రంజిత్, అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
మంజుల ఇంట్లో ఎవరు లేని సమయంలో సెల్ఫీ వీడియో ఆన్ చేసి తన ముందు ఉంచుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తాను కోన ఊపిరితో ఉండగా చుసిన ఆమె కుమారుడు తన నాన్నకి ఫోన్ చేయగా మంజుల భర్త వచ్చేలోగా ప్రాణాలు వదిలింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వీడియోకి సంబందించిన వివరాలు బయటికి రాలేదు.