Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 13, 2021 Rasi Phalalu
Today Horoscope In Telugu 13,February 2021: జ్యోతిషశాస్త్రాన్ని భారతీయు ప్రజలు ఎంతగానో విశ్వసిస్తారు. ఈ జ్యోతిషసాస్త్రం తో గ్రహాల కదలికలు, జాతకంపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. రాశిచక్రంలో 12 రాశులు ఉంటాయి. మానవుల పుట్టుక ఆధారంగా వారు ఏ రాశిలో జన్మించారో లెక్కిస్తాను. తమ భవిష్యత్తు లో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతివారిలోను ఉంటుంది. వాటిని ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు మనకు ఎంతో తోడ్పడుతాయి.

మేష రాశి (Aries ) (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి పని చేసుకొనే వారికీ, చిన్న వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి ఉటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి కాస్త పెరుగుతుంది. ఉద్యోగంలో స్థానచలనం జరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
వృషభ రాశి (Taurus ) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఖర్చులను తగ్గించుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇరుగు పొరుగుతో కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు పరవాలేదు. కోర్టు కేసులో చిక్కులు తప్పవు.
మిథున రాశి (Gemini ) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఇష్టమైన వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. పని ఒత్తిడి ఉంటుంది. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు ఎంత శ్రమ పడితే అంత మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కొంచం జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి (Cancer ) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం బాగుంది. బంధువు తాకిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు అన్ని విధాలా బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో తిప్పలు తప్పవు.
సింహ రాశి (Leo ) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పరవాలేదు. మంచి ఉద్యోగంలో చేరతారు. పెళ్లి ప్రయత్నం సాగుతాయి. తగాదాల్లో తలదూర్చవద్దు. విదేశాల్లో ఉన్న వారి నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులకు బాగుంది. ప్రేమలు ఫలిస్తాయి.
కన్య రాశి (Virgo ) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
విదేశాల్లో నుండి నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. వివాహ ప్రయత్నాలకు నెరవేరుతాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కోర్టు కేసులో పురోగతి సాధిస్తారు.
తులా రాశి (Libra ) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అన్నిటికి అనుకూమైన సమయం. వ్యాపారులకు, లాయర్లకు, కోర్టు ఉద్యోగులకు మంచి గడియలు ఉన్నాయి. ఆర్థికంగా పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి జరిగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సత్పలితాన్ని ఇస్తాయి.
వృశ్చిక రాశి (Scorpio ) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
ఆర్థికంగా సమయం బాగానే ఉంది. రుణాల నుంచి బయటపడతారు. పెళ్లికి శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు జరుగుతాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. ప్రేమ లో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు శుభకరంగా ఉంది.
ధనస్సు రాశి (Sagittarius ) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆస్తులు బాగా పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్త వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు జరుగుతాయి. . విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి న సమయం. ప్రేమ వ్యవహారాల్లో అడుగులు పడుతాయి.
మకర రాశి (Capricorn ) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఆదాయానికి బాగాలేదు. సంపాదన పెంచుకునేందుకు ప్రయత్నాలు చేయాలి. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్యం మాత్రం చూసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది.
కుంభ రాశి (Aquarius ) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కష్టాలు ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు జరుగుతాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్, స్వయం ఉపాధివారికి బాగుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
మీన రాశి (Pices ) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
పొదుపు ప్రయత్నాలు చేస్తారు. బంధువుల తాకిడి పెరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులకు బాగుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. కోర్టు కేసు లో నెగ్గుతాడు.