Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 12, 2021 Rasi Phalalu
Today Horoscope In Telugu 12 February 2021: జ్యోతిషశాస్త్రాన్ని భారతీయు ప్రజలు ఎంతగానో విశ్వసిస్తారు. ఈ జ్యోతిషసాస్త్రం తో గ్రహాల కదలికలు, జాతకంపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. రాశిచక్రంలో 12 రాశులు ఉంటాయి. మానవుల పుట్టుక ఆధారంగా వారు ఏ రాశిలో జన్మించారో లెక్కిస్తాను. తమ భవిష్యత్తు లో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతివారిలోను ఉంటుంది. వాటిని ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు మనకు ఎంతో తోడ్పడుతాయి.

మేష రాశి (Aries ) (అశ్విని, భరణి, కృత్తిక 1) :
ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఏ పనిలోనైనా సానుకూల వ్యవహరిస్తారు. ధన,వస్తూ లాభం ఉంది. భవిష్యత్తుకు అవసరమయ్యే నిర్ణయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు. అప్పుబాధలు తొలగుతాయి. విద్యార్థులు విజయాలు అందుకుంటారు. కోర్టు కేసులు ఉన్నట్టయితే అందులోను విజయం చేకూరుతుంది.
వృషభ రాశి (Taurus ) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) :
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా వీరి నిర్ణయాలు సత్ఫలితలను అందిస్తాయి. మొదలుపెట్టిన పనులు చాలా వరకు చేయగలుగుతారు. దూర ప్రాంతం నుంచి మీరు కోరుకున్న సమాచారం అందుతుంది. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూల సమయం. ఆరోగ్యం బాగుంటుంది.
మిథున రాశి (Gemini ) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) :
ఈ రాశి వారు ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. ఖర్చులు ఎక్కువవుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. పెళ్లి సంబంధాలు వస్తాయి. ప్రేమ వ్యవహారాలు సత్పలితాన్ని ఇస్తుంది.
కర్కాటక రాశి (Cancer ) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) :
ఈ రాశి వారికీ కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కనబడుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. వ్యాపారంలో లాభాలకు చేకూరుతాయి. కొన్ని కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులకు కూడా అనుకున్నది సాధిస్తారు.
సింహ రాశి (Leo ) (మఖ, పుబ్బ, ఉత్తర 1) :
ఈ రాశి వారు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇపుడు ఫలిస్తాయి. ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లోనే ఉద్యోగం లభిస్తుంది. పలుకుబడి గల వారితో పరిచయాలు జరుగుతాయి.
కన్య రాశి (Virgo ) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) :
ఈ రాశి వారు ఉద్యోగంలో సమర్థతతో పని చేస్తారు. అవసరాలకు ధనం చేకూరుతుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో సమస్యలు వస్తాయి. . ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు కష్టపడాల్సి వస్తుంది.
తులా రాశి (Libra ) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) :
ఈ రాశి వారికీ ఆకస్మిక ధనలాభ చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగం కష్టాలు లేకుండా సాఫీగా కొనసాగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. భవిష్యత్తుకు సంబంధించి అవసరమైన ప్రణాళికను రూపొందిస్తారు. వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
వృశ్చిక రాశి (Scorpio ) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :
ఈ రాశి వారు ముఖ్యమైన పనులు చేయగలుగుతారు. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంపద పెరిగే అవకాశం ఉంది. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్య కాస్త నిదానంగా కొనసాగుతుంది.
ధనస్సు రాశి (Sagittarius ) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) :
ఈ రాశి వారు అనుకున్న ప్రయత్నం చేస్తే మీకు కచ్చితంగా జరుగుతుంది. బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అనుకూలమైన సమయం ఇది. ఉద్యోగంలో అవకాశాలు వస్తాయి. అందరికీ మేలు జరిగే పనులు చేపట్టుతారు. ప్రశాంతత చేకూరుతుంది. ప్రేమికురాలితో సరదాగా గడిపే అవకాశం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది.
మకర రాశి (Capricorn ) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) :
ఈ రాశి వారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. జీవితంలో స్థిరత్వం ఏర్పడడానికి మంచి అవకాశం. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సరిఅయిన సమయం కాదు. విద్యార్థులు కాస్త కష్టపడితే మేలు జరుగుతుంది.
కుంభ రాశి (Aquarius ) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) :
ఈ రాశి వారికీ సమయం అంతగా బాగాలేదు. ప్రతి పనికీ ఆటంకాలు వస్తాయి. ముఖ్య కార్యం వాయిదా వేయడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. వ్యాపారంలో లాభాలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉంటుంది.
మీన రాశి (Pices ) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) :
ఈ రాశి వారికీ అనుకూలమైన సమయం ఇది. చేపట్టిన పనున్నీ పూర్తవుతాయి. అవరోధాలు, ఆటంకాలు వుండవు. ఆర్థికంగా కలిసి వస్తుంది. మిమ్మల్ని చూసి అసూయపడే వారుంటారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి. ఆరోగ్యం కాపాడుకోవాలి. పని ఒత్తిడి కి లోనవుతారు.