Bharat Bandh: భారత్ బంద్ ప్రకటించిన రైతులు !

రైతులకు అనుకూలంగా లేని చట్టాలను రద్దుచేయాలని, అన్న దాతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్రంతో గత 10 రోజుల నుండి మధ్యప్రదేశ్,గుజరాత్,హర్యానా, పంజాబ్ లతో సహా పలు రాష్ట్రాల రైతులు వేలాది మంది ఢిల్లీ కి చేరుకొని కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నారు.
రైతులు కోరే చట్టాలను రద్దు చేస్తే వారికీ మేలు అధికంగా ఉంటుందని ప్రభుత్వం చెప్పుకోస్తోంది. ఈ విషయం పై కేంద్రం, రైతులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో డిసెంబర్ 8 న భారత్ బంద్ చేపట్టాలని రైతుసంఘాలు నిర్ణయించారు.
భారత్ బంద్ కు బిజెపి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలన్నీ మద్దతు పలికాయి . అదేవిదంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులు చేపట్టిన బంద్ కు మద్దతు పలికింది.
వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ బంద్ ను రేపు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే చేపట్టాలని బంద్ లో పాల్గొనే వారికీ విజ్ఞప్తి చేసారు.