Suhas Family Drama Movie Review

Movie :- Family Drama (2021) Review
నటీనటులు :- సుహస్ , తేజ కాసారపు , పూజా కిరణ్ , అనూష నూతుల , శృతి మెహర్ , సంజయ్ రాథా
నిర్మాతలు :- చస్మ ఫిల్మ్స్ , నూతన భారతి ఫిల్మ్స్
సంగీత దర్శకుడు :- అజయ్ మరియు సంజయ్
డైరెక్టర్ :- మెహెర్ తేజ్
Release Date : 29th October ‘Sony LIV ott’
Story (Spoiler Free ) :-
ఈ కథ నగరం లో 6 సీరియల్ కిల్లింగ్స్ జరిగాయి అనే వార్త టీవీ లో చూపిస్తూ మొదలవుతుంది. రామ్ ( సుహాస్ ) స్టైలిష్ మరియు డిఫరెంట్ ఇంట్రడక్షన్. సుహాస్ మత్తుపదార్థాలు అమ్ముతున్నాడు. ఇంకో పక్క ఒక ఇంట్లో తల్లితండ్రులు తో పాటు కొడుకు కోడలు ఉంటారు. కొడుకు లక్ష్మణ్. లక్ష్మణ్ కి ఉద్యోగం లేదు. రెండ్రోజులో ఉద్యోగం తెచుకోకుంటే ఇంటినుంచి గెంటేస్తాను అని తండ్రి వార్నింగ్ ఇస్తారు.
ఇంతలో నగేష్ అనే వ్యక్తి రామ్ ని కలిసి అప్పు డబ్బులు ఎప్పుడు ఇస్తావ్ అని అడగగా రామ్ త్వరలో ఇచ్చేస్తా అని చెప్పి పంపించేశారు. ఇంకోపక్క రెండ్రోజులు అయినా లక్షణ్ కి ఉద్యోగం రాలేదు. సమయానుసారం లక్ష్మణ్ రామ్ తో ఒక డీల్ కుదిరించుకొని ప్లాన్ అమలు చేస్తాడు. ఇందులో లక్ష్మణ్ తల్లి సహాయం కూడా ఉంటుంది. మొత్తానికి లక్ష్మణ్ తండ్రి ప్యారలైజ్ అవుతారు. ఇప్పుడు రామ్ లక్ష్మణ్ ఇంటికి వస్తాడు.
ట్విస్ట్ ఏంటంటే రామ్ లక్ష్మణ్ అన్న తమ్ములు. కొని అనుకోని సంఘటనల చేత రామ్ తనకు అప్పు ఇచ్చిన స్నేహితుడైన నగేష్ ని గొంతు కోసి చంపేస్తాడు. ఈ సన్నివేశం లక్ష్మణ్ భార్య అయినా యామిని చూస్తుంది. యామిని చాల భయపడిపోయింది. ఇంకోపక్క లక్ష్మణ్ ఆయుర్వేదిక్ డాక్టర్ అయినా వాసుకిని చంపడం రామ్ భార్య మహి చూసి టెన్షన్ తో భయపడిపోయింది.
అస్సలు రామ్ ఎవరు ? రామ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? రామ్ లక్ష్మణ్ నిజంగానే అన్నతమ్ములా ? అసలు లక్ష్మణ్ వాళ్ళ నాన్న ఎందుకు ప్యారలైజ్ కి గురయ్యారు ? దీనికి గల కారణాలు ఏంటి ? రామ్ లక్ష్మణ్ భార్యలు నిజాలు తెలుసుకొని ఎం చేసారు ? చివరికి రామ్ లక్ష్మణ్ లా పరిస్థితి ఏంటి ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా సోనీ లివ్ లో చూడాల్సిందే.
Positives👍 :-
- సుహాస్ పాత్రలో ఒదిగిపోయారు. సినిమా అంతటా సుహాస్ తన నటనతో ప్రేక్షకులని కట్టిపడేస్తారు.
- దర్శకడు కధనం నడిపే విధానం ప్రేక్షకులని అలాగే కూర్చోబెట్టేస్తుంది. ఎక్కడ బోరింగ్ మరియు అనవసరపు సన్నివేశం లేకుండా బాగా తీశారు.
- సినిమా యొక నిడివి.
- కథ కొత్తగా మరియు ప్రేక్షకులని ఆలోచింపచేసేలా ఉంది.
- ఎడిటింగ్ పర్వాలేదు.
- మ్యూజిక్ ఓకే.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
Negatives 👎 :-
- కాస్త స్లో గా ఉంటుంది.
Overall :-
మొత్తానికి సుహాస్ నటించిన ఫ్యామిలీ డ్రామా అనే సినిమా ప్రేక్షకులని అలరించడమే కాకా ఆలోచింపచేసేలా చేస్తుంది. సమాజం లో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి అలాంటి ఒక సంఘటనని తీసుకొని దర్శకుడు చాల బాగా తెరకెక్కించారు. మ్యూజిక్ కూడా బాగుంది. మిగితా పాత్రధారులు కూడా సినిమాకి ప్లస్ అయ్యేలా చేశారు. కాస్త స్లో గా ఉంటుంది.
సినిమాటోగ్రఫీ మరియు నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి సుహాస్ రెండవ సినిమా అయినా ఫ్యామిలీ డ్రామా సినిమా కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది అనే విషయం లో ఎటువంటి సందేహం లేదు. కుటుంబం అంత కలిసి సోనీ లివ్ లో ఓసారి చూసేయండి.
Rating:- 3.25 /5