Bruce Lee: బ్రూస్లీ కుటుంబాన్ని పోషించడం కోసం … మీకు తెలియని నిజాలు !

దేశానికే కాదు ప్రపంచానికికంటతగా పరిచయమున్న డ్రాగన్ లాంటి వ్యక్తి బ్రూస్లీ… ఈ వ్యక్తి గురించి పూరి తన మ్యూజింగ్ లో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. మార్షల్ ఆర్ట్స్‌లో ఫేమస్ అయిన బ్రూస్లీ జీవితంలో ఎన్నో ట్విస్టులున్నాయని పూరి మ్యూజింగ్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు.
పూరి బ్రూస్లీ గురించి మాట్లాడుతూ.. ”చైనీస్ జోడియాక్ ప్రకారం.. బిడ్డ పుట్టిన గడియ, సంవత్సరం ఈ రెండూ గానీ డ్రాగన్ వస్తే, వాడు గొప్పవాడు అవుతాడని చైనీయులు గట్టిగా నమ్ముతారు. సరిగ్గా గడియ లో డ్రాగన్ లాంటి బిడ్డ శాన్ఫ్రాన్సిస్కోలో పుట్టాడు. అతడే బ్రూస్లీ.
బ్రూస్లీ తల్లిదండ్రులు ఇద్దరు గాయకులు , వీరు కొంతకాలం తరవాత హాంకాంగ్‌కు మారారు . పదమూడేళ్ల వయసుకే బ్రూస్లీ చైల్డ్ ఆర్టిస్టుగా ఇరవై సినిమాల్లో చేశాడు . యీప్ మ్యాన్ దగ్గర కుంగ్‌పూ పాటలు నేర్చుకుని, ఇంటర్ స్కూల్ లో బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పొందాడు .
మరొకవిషయం ఏంటంటే ఇతను డాన్స్ కూడా చాల బాగా చేస్తాడు. తన సొంత ఖర్చులతో ఫిలాసఫీ కూడా చదువుకున్నాడు.
దీని తరవాత సొంతంగా ఓ మార్షల్ ఆర్ట్ , ఫిలాసఫీ టీచర్ గా పనిచేస్తూ ‘లిండా’ అనే స్టూడెంట్ ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చాడు.
తన కుటుంబాన్ని పోషించడానికి సినిమాలలో చిన్న చిన్న పత్రాలు వేసుకుంటూ ఉండేవాడు. తరవాత కుటుంబంతో సహా హాంకాంగ్ వెళ్లి ఓ ప్రొడ్యూసర్ సాయంతో ఓ సినిమా తీశాడు. అదే ‘ద బిగ్ బాస్’. అప్పట్లో అది బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత ‘ద గేమ్ ఆఫ్ డెత్’ మూవీ తీశాడు. ఈ సినిమాతో హాంకాంగ్ చిత్ర పరిశ్రమ చరిత్రే మారిపోఎలాచేసాడు .
ఒక రోజు బ్రూస్లీ తలనొప్పిగా ఉందని టాబ్లెట్ వేసుకొని శాశ్వతంగా నిద్రలోకి జారిపోయాడు.