బొమ్మ బ్లాక్ బస్టర్ ఎందుకంటే!
బొమ్మ బ్లాక్ బస్టర్ ఎందుకంటే!
సంక్రాంతి కి 4 పెద్ద సినిమాలు వచ్చాయి , అందులో 2 సినిమాలకి మంచి టాక్ వచ్చింది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం అయాయి, ఇందులో అంతగా అంచనాలు లేకుండా వచ్చిన సినిమా ఎఫ్2, మిగతా వాటిలో లేనిది ఇందులో ఉన్నది కామెడీ ఎంటరటైన్మెంట్ , ప్రేక్షకుల ను కడుపుబ్బ నవ్వించారు 2 గంటలు .
ఇంకేం మరి సంక్రాంతి కి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు సరైన సినిమా పడటం తో బ్రహ్మరథం పడుతున్నారు, ఎక్కడ చూసిన హౌజ్ ఫుల్ బోర్డ్ లే, అయితే థియేటర్ ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరింత పెద్ద కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమా కి గ్రేట్ అసెట్ అంటే వెంకటేష్ కామెడీ టైమింగ్, టాప్ హీరోల్లో ఏ హీరోకి సాధ్యం కాని కామెడీ టైమింగ్ ఇతని సొంతం, తమన్నా అందాలు మరో అసెట్, ఇంకా డైరెక్షన్ కూడా చాలా కుదిరింది , కొందరు ఈ డైరెక్టర్ నీ ఈ. వి. వి తో పోలుస్తున్నారు, వరుణ్ , మేహరీన్ కూడా తమ పాత్ర మేర బాగా చేసారు.
మొత్తానికి ఈ సంక్రాంతి వెంకటేష్ కి మళ్లీ క్రాంతి తెచ్చిందని చెప్పుకోవాలి.