Today Telugu News Updates
భార్య సోదరిపై కన్ను…కత్తితో దాడి:-

హైదరాబాద్ శివార్లలోని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఒక యువతిని,సయ్యద్ అనే వ్యక్తి 5సం,,ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి 2సం,,ల పాప కూడా ఉంది.
అయితే కొన్నిరోజులుగా సయ్యద్ తన భార్య సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తన భార్య దృష్టికి రావడంతో గట్టిగానే మందలించింది.
అయినాకని తన బుద్దిని మార్చుకోక పోవడంతో, సయ్యద్ ని తన భార్య కుటుంబ సభ్యులు ఇంటికి పిలిచి మందలించడంతో ఘర్షణ చోటుచేసుకొని ,సయ్యద్ ని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి కత్తితో అతి దారుణంగా చంపారు.