Eye Conjunctivitis : కండ్ల కలుకలు ఉన్నవారిని చూస్తే మనకు కూడా వచ్చేస్తాయా?
Eye Conjunctivitis : గత కొన్ని రోజులుగా మనం కళ్ళ కలక విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. ఈ కళ్ళ కలకను ఐ ఫ్లూ లేదా పింక్ ఐ అని కూడా పిలుస్తారు. కళ్ళ కలక రావడం వల్ల కండ్లు ఎర్రగా లేదా గులాబీ రంగులో మారుతూ ఉంటాయి. ఇదొక రకమైన ఐ ఇన్ఫెక్షన్… ఈ ఇన్ఫెక్షన్ వైరస్, బ్యాక్టీరియా అలర్జీలతో వస్తుంది. ముఖ్యంగా ఈ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ద్వారా త్వరగా మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందుతుంది. కానీ అలర్జీ ద్వారా వచ్చిన కళ్ళ కలక మాత్రం అలా వ్యాప్తి చెందదు. అయితే చాలామందికి ఒక సందేహం వచ్చి ఉంటుంది.. ఈ ఐ ఫ్లూ వర్షాకాలంలోనే ఎందుకు వ్యాప్తి చెందుతుందని.. దానికి ముఖ్య కారణం వానకాలంలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి..

కళ్ళ కలక వస్తే ఉండే లక్షణాలు ఏంటంటే కళ్ళు ఎరుపెక్కడం, కండ్లల్లో మంటగా ఉండడం, కళ్ల దగ్గర దురద ఉండడం, కంట్లో నుండి నీళ్లు రావడం జరుగుతుంది. అయితే ఈ ఐ ఫ్లూ రెండు వారాలు మాత్రమే ఉంటుంది. కానీ అప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గోరువెచ్చని నీటితో కండ్ల దగ్గర శుభ్రం చేసుకోవాలి. అలాగే ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించాలి , టవల్స్ వాడాలి. తరచూ చేతులు కడుగుతూ ఉండాలి. అలాగే బయటికి వెళ్తున్నప్పుడు కళ్ళజోడును ఉపయోగించాలి.