health tips in telugu
Hiccups: ఎక్కిళ్లు ఆగట్లేదా.. అయితే ఇలా చేయండి చిటెకెలో తగ్గిపోతాయి..
ఎక్కిళ్లు.. మనం నిత్యజీవితంలో తప్పనిసరిగా ప్రతిఒక్కరూ ఎదుర్కొనే సమస్య. ఈ ఎక్కిళ్లతో ప్రమాదమేమి లేదు, కానీ ఎక్కువగా వచ్చినపుడు మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. వీటిని చిన్న చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అందులో మొదటిది..
ఛాతి నిండుగా గాలి పీల్చుకొని, అలాగే పట్టి ఉంచాలి. దీంతో శరీరంలోని డయాఫ్రమ్ సర్దుకొని ఎక్కిళ్లు తగ్గుతాయి.

ఎక్కిళ్లు అదేపనిగా వస్తుంటే కప్పున్నర నీళ్లలో చెంచా యాలకుల పొడి వేసి మరిగించాలి. ఇలా వడకట్టిన నీటిని త్రాగడం వల్ల శ్వాసకోస వ్యవస్థ ఉత్తేజితమై ఎక్కిళ్లు ఆగిపోతాయి.
పెరుగులో ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
అల్లం ముక్కను నమిలి రసాన్ని మింగడం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి.