Political News

GHMC Elections : ఓటు ఆయుధాన్ని ప్రతి ఒక్కరు వాడాలని కోరిన: కోదండ రామ్

GHMC Elections

GHMC Elections : అర్హతకలిగిన  ప్రతి ఒక్క ఓటరు  తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రో. కోదండ రామ్ కోరారు. ఓటు వేసిన అనంతరం కొదండ రామ్ మీడియాతో ద్వారా మాట్లాడుతూ భారత దేశంలో కూడా 1919 నుంచి ఓటు హక్కు కోరుతూ పోరాటాలు అనేకం జరిగాయని కోదండరాం అన్నారు. చివరికి భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతనే సర్వజనీనమైన ఓటు హక్కు అందరికీ వచ్చిందని తెలియజేసారు.

ఈ  ఓటు హక్కు వల్లనే దేశ స్వభావం మారిందన్నారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలోనూ, విధానాలు ప్రభావితం చేయడంలోనూ ప్రతి మనిషికి సమానమైన విలువ చేకూరిందన్నారు . ఇంత విలువైన ఓటును మనం వినియోగించుకోకపోతే మన అస్థిత్వం దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button