కొన్ని గంటల్లో పెళ్లిపీటలెక్కబోతూ అందరు ఆత్మహత్య !

పెళ్లి పీటలెక్కాల్సిన అమ్మాయితో సహా ఆ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. ఈ సంగటన ఆ ఊరి ప్రజలతో సహా రాష్ట్ర ప్రజలందరి హృదయాలను కలచివేసింది.
వివరాల్లోకి వెళ్తే … ఖమ్మం జిల్లా 3వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంగటన జరిగింది. గోవిందమ్మ అనే ఒక మహిళకు ఇద్దరు కూతుళ్లు పెద్దమ్మాయి రాధిక 30 ఏళ్ళు, చిన్న అమ్మాయి రమ్య కు 29 ఏళ్ళు ఇందులో పెద్దమ్మాయి కి ఒక మంచి సంబంధం రావడంతో వారు అడిగిన కట్నానికి ఒప్పుకొని ఎలాగైనా రాధిక పెళ్లి చేయాలనీ అనుకుంది.
అసలే పేదరికంలో ఉన్న గోవిందమ్మ కూలినాలి చేసుకొంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. గోవిందమ్మ భర్త ఏ పని చేయకపోవడం తో ఆ కుటుంబానికి గడ్డు పరిస్థితి వచ్చింది.
అయినా కానీ గుండె ధైర్యంతో పెళ్ళికి ఒప్పుకొని వారు అడిగిన వాటిని ఇస్తానని మాట ఇచ్చింది. కానీ పెళ్లి దగ్గర పడుతున్నకొద్దీ ఎక్కడ డబ్బులు పుట్టకపోవడంతో పరువుపోతుందన్న అవమానంతో ఆ కుటుంబసభ్యులు అందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.