Tollywood news in telugu

Pawan Kalyan: ప్రతి ఒక్క యువకుడు, యువతి యుద్ధ కళలు కచ్చితంగా నేర్చుకోవాలి : పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan :  హీరో  పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజిగా  ఉంటూనే, అటు సినిమాలు చేస్తున్నారు. పవన్   ప్రస్తుతం తన ‘వకీల్ సాబ్’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా గడుపుతున్నాడు.  ఒకవైపు సినిమా.. మరోవైపు పాలిటిక్స్‌లలో  ఉత్సాహంగా ఉంటూ .. తాజాగా యువతకు ఒక మంచి సందేశం ఇచ్చారు. యువత బాడీ ఫిజిక్‌తో పాటు దేశీయంగా ఏదైనా ఒక యుద్ధ కళను కచ్చితంగా  నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇది మీ భవిష్యత్తులో మీకుమీరు రక్షించుకొనేందుకు ఉపయోగ పడుతుందని చెప్పారు.  

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  నెల్లూరుకి చెందిన మార్షల్ ఆర్ట్‌లో ఆరితేరిన  ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో శాలువాతో, అలాగే ఒక ఆంజనేయుడి ప్రతిమను  ఇచ్చి సత్కరించారు.

అదేవిదంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మన భారదేశం లో ఎన్నో రకాల యుద్ధ కళలున్నాయి. వాటిలో ఎదో ఒకదాన్ని కచ్చితంగా  విద్యార్థులు నేర్చుకుంటే.. వారికి మనో ధైర్యంతో పాటు ఆత్మ విశ్వాసం కూడా మీ వెంట ఉంటుంది అని అలాగే  ఆసియా ఖండంలో పలు మార్షల్ ఆర్ట్స్ విద్యలు ఉన్నాయి అని వెల్లడించాడు.

Read  ishq 2021 telugu movie - ఇష్క్ (2021)

ఇంకా   వింగ్‌చున్’ అనే మార్షల్ ఆర్ట్స్ శిక్షకుల గురించి శోధిస్తూ ఉంటే.. ప్రభాకర్ రెడ్డి పేరు నా దృష్టికి వచ్చిందని తెలిపాడు.  విదేశాల్లో శిక్షణ ఇవ్వమని  ప్రభాకర్ రెడ్డికి పిలుపు వచ్చినా.. మాతృదేశంపై అభిమానంతో ఇక్కడివాళ్లకు ఈ విద్యను అందిస్తున్నాడని , ఇతని దేశ భక్తికి  జనసేన ట్రస్ట్ తరుపున ఆర్ధిక తోడ్పాటు ఎప్పటికి ఉటుందని  పవన్ కళ్యాణ్ తెలిపాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button