Tollywood news in telugu

ఇంత వయోసొచ్చాక కూడా తెలియలేదు నాకు ఆ సమస్య ఉందని…!

మాములుగా ప్రజలు బ్రతికితే సినిమా సెలెబ్రిటీల బ్రతకాలి అనుకుంటారు. వీరు హ్యాపీగా జీవిస్తూ ఉంటారని, బంగారు కంచంలో తింటారని, లగ్జారీగా  బ్రతుకుతారని చాల మంది భ్రమపడుతూ ఉంటారు. వారి జీవితాల్లో కూడా కష్టాలు ఉంటాయని, వారుకూడా మనలాగే మాములు మనుషులని తక్కువ మంది అర్థం చేసుకుంటారు. వీరు సక్సెస్ సాధించేంతవరకూ కష్టపడి , పేరు తెచ్చుకొని, ఆ పేరును నిలబెట్టుకోడానికి ఇంకా విపరీతంగా వారి స్కిల్స్ ని పెంచుకొని మరీ కష్టపడుతూ ఉంటారు.

 కమల్ హాసన్ కూతురు స్రుతి హాసన్. సినిమా కష్టాలే కాకుండా తన పర్సనల్ లైఫ్ లో కూడా ఒక  సమస్యతో బాధపడుతుందట. అదేంటంటే శృతికి చిన్నతనం నుండి యంగ్జాయిట్ డిజార్డర్ ఉందట. ఎపుడైనా స్టేజ్ షోలు ఇచ్చేటపుడు కాస్త బయమేసేదని, ఈ విషయాన్నీ చాల ఏళ్లతరవాత గమనించానని, ఇండస్ట్రీలోని వచ్చాక కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడ్డానని తెలిపింది.  నేను పడే బాధ ఎవరికీ చెప్పిన అర్థం చేసుకొనే వారు కాదని, పైగా నేను చెప్పే విషయాన్నీ తేలికగా తీసుకొని నవ్వేవారని వెల్లడించింది.

shruti haasan

అదేవిదంగా శృతి మ్యూజిక్ స్కూల్ లో పాటలు నేర్చుకొనే సమయంలో ఒక పాట పూర్తిగా నేర్చుకొని, స్టేజ్ పై పాడదామనే సరికి భయపడే దాన్నని , నన్నునేను ఒక బలహీనురాలిగా ఊహించుకొని, ఈ పోటీ ప్రపంచంలో  ముందుకు వెళ్లగలన అనే అనుమానం ఉండేదని, ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఈ భయం నన్ను వెంటాడిందని  తెలిపింది. ఇలా తనకి 30 సంవత్సరాలు వచ్చాక తానొక   యంగ్జాయిట్ డిజార్డర్ తో బాధపడుతున్నానని తెలుసుకుందట.

ఈ బాధనుండి బయటపడేందుకు టాక్ థెరపీని ఎంచుకొని ఈ డిప్రెషన్ నుండి బయటపడింది. ఇక స్రుతి చేస్తున్న సినిమాల విషయానికి వస్తే… ఈ ముద్దుగుమ్మ ‘వకీల్ షబ్’ సినిమాలో నటిస్తుంది. అదేవిదంగా ప్రభాస్ తో ‘సలార్’ లోను, విజయ్ సేతుపతి తో ‘లాభం’ సినిమాలలో బిజిగా గడుపుతున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button