Tollywood news in telugu

Evaru Meelo Koteewswarulu: ఒక్కో అప్డేట్ తో ప్రేక్షకులకు దగ్గరవుతున్న మీలో ఎవరు కోటీశ్వరులు…!

Evaru Meelo Koteewswarulu

బుల్లితెర పై హోస్ట్ గా రాబోతున్న  యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ చేస్తున్న ప్రోగ్రాం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. ఇదే ఫార్ములాతో వచ్చిన ప్రోగ్రామ్స్ పలు దేశాల్లో కాసుల వర్షాన్ని కురిపించాయి. ఇపుడు ఈ ఫార్ములాను ఇండియాలో మొదలు పెట్టి సక్సెస్ అవుతున్నారు. ఈ ఫార్ములా ఇప్పటికే 120 దేశాల్లో సూపర్ హిట్ సాధించింది.  ఇపుడు  ప్రోగ్రాం కి సంబంధించి ఒక్కో అప్డేట్ ప్రేక్షకులలో ఉత్సాహాన్ని పెంచుతుంది.

ఈ ప్రోగ్రాం కోసం కేవలం తారక్ లుక్స్ పై  బారి ఖర్చుచేస్తున్నారు.  టీజర్‌లో కనిపించిన లుక్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్‌ చేశారు మేకర్స్‌. ఇండియాస్ బెస్ట్ స్టైలిష్ట్ మనీష్ మల్హోత్రా డిజైన్‌ చేసిన బ్లాక్‌ సూట్‌ కోసం లక్షల్లో ఖర్చు చేశారట. పేరుకు టీవీ ప్రోగ్రామే అయినా  ఖర్చు మాత్రం బారిగానే చేయనున్నారు.

ఇక ఇంతకముందు  ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌ తో  ఫోటో షూట్ చేసిన ‘డబూ రత్నాని’, ఈ షో కోసం ప్రత్యేకించి ఎన్టీఆర్‌తో ఒక  ఫోటోషూట్‌ చేశారు. ఈ  ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.  దీంతో అటు తారక్  అభిమానులతో పాటు ప్రేక్షకులు ప్రోగ్రాం కోసం  వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా బిగ్ సక్సెస్ సాధించిన ఎన్టీఆర్, ఇపుడు  ‌ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ తో మరోసారి తన పర్ఫామెన్స్ ను బుల్లితెరపై చూపించబోతున్నాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button