Episode 9 Telugu Bigg Boss Season 5 Live Updates – Day 8

Telugu Bigg Boss Season 5 Day 8: ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో ని దూకుడు అనే సాంగ్ తో కంటెస్టెంట్స్ ని నిద్ర లేపగా కంటెస్టెంట్స్ తమదైన స్టైల్ లో డాన్స్ వేస్తున్నారు. తర్వాత ఉదయం 9 :౩౦ నిమిషాలకు శ్వేతా వర్మ మరియు మానస్ కలిసి నామినేషన్ గురించి డిస్కస్ చేస్తున్నారు. తర్వాత కాజల్ మరియు జెస్సీ డిస్కస్ చేస్తున్నారు. కాస్త కామెడీ కూడా చేస్తున్నారు సన్నీ పైన.
మధ్యాహ్నం లోబో సీరియస్ గా ఉన్నారు రవి మీద. రవి లోబో కలిసి కామెడీ చేస్తున్నారు. తర్వాత కంటెస్టెంట్స్ అందరు కలిసి వాషింగ్ రూమ్ మరియు ప్లేట్స్ క్లీనింగ్ పైన సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. ఉమాదేవి మళ్ళీ సీరియస్ అయింది. లోబో మరియు ఉమాదేవి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు లోబో కామెడీ పాట పాడుతున్నారు.
ఇపుడు బిగ్ బాస్ ఇంటి సభ్యులని టీం గా డివైడ్ చేస్తున్నారు.టీమ్స్ పేరు టీం వూల్ఫ్ మరియు టీం ఈగల్. కంటెస్టెంట్స్ టీం గా డివైడ్ అయిపోయారు. లోబో , యని మాస్టర్ కామెడీ చేస్తున్నారు. రాత్రి 9:30 నిమిషాలకు నామినేషన్ ప్రక్రియ మొదలయింది. ఇంటి సభ్యులు రెడ్ పెయింట్ తీసుకొని ఒకరి టీం కాకుండా ఇంకో టీం సభ్యులని ఇద్దరినీ నామినేట్ చేయవలసి ఉంటుంది. సిరి కెప్టెన్ కాబట్టి సిరి ని ఎవరు నామినేట్ చేయకూడదు.
సిరి తో ఈ ప్రక్రియ మొదలయింది. సిరి రెడ్ పెయింట్ తీసుకొని ఉమా దేవి కి మరియు నటరాజ్ మాస్టర్ కి పెయింట్ పూసి నామినెట్ చేసింది. రీసన్స్ చాల సిల్లీ గా ఉన్నాయి. తర్వాత నటరాజ్ మాస్టర్ వచ్చి ప్రియకి మరియు ప్రియాంక ని పెయింట్ పూసి నామినెట్ చేశారు. తర్వాత యని మాస్టర్ వచ్చి ఉమా దేవి కి మరియు కాజల్ ని రెడ్ పెయింట్ పూసి నామినేట్ చేసారు. సన్నీ వచ్చి ప్రియా ని మరియు ప్రియాంక ని పెయింట్ పూసి నామినేట్ చేసారు బ్రేక్.
overall :- ఇంతవరకు జరిగిన నామినేషన్ ప్రక్రియ బాగానే ఉన్నా , ఇంటి సభ్యులు చెప్పిన రీజన్స్ మాత్రం చాలా అంటే చాలా సిల్లీ గా ఉన్నాయి.
10:42PM :- బ్రేక్ తర్వాత ప్రియాంక వచ్చి నటరాజ్ మాస్టర్ కి మరియు సన్నీ కి పెయింట్ పూసి నామినెట్ చేసింది. తర్వాత మానస్ వచ్చి లోబో కి మరియు ప్రియా ని నామినేట్ చేశారు. లోబో బూతులు తిట్టారు. తర్వాత విశ్వా వచ్చి ఉమా దేవి కి పెయింట్ పూసి ఆలు కర్రీ ఇష్యూ తో మరియు కాజల్ ని చేంజ్ చూడలేదు అని నామినేట్ చేశారు.
లహరి వచ్చి హమీద మరియు యని మాస్టర్ ని నామినేట్ చేశారు, సిల్లీ రీసన్స్ చెప్తూ నామినేట్ చేశారు. తర్వాత హమీద వచ్చి లహరి కి మరియు శ్వేతా వర్మ ని నామినేట్ చేసింది.
ఉమాదేవి వచ్చి బండ బూతులు తిట్టి యని మాస్టర్ ని మరియు విశ్వా ని నామినేట్ చేశారు. ఇద్దరికీ ఒకటే డైలాగ్ నా పుట్టలో వేలు పెడితే నేనెందుకు ఊరుకుంటాను అని చెప్పింది.
తర్వాత లోబో వచ్చి శ్వేతా వర్మ మరియు రవి ని సేఫ్ గా నామినేట్ చేశారు. శ్వేతా వర్మ వచ్చి లోబో కి ని ఫ్రెండ్ షిప్ బ్యాండ్ వద్దు అని తీసి పక్కన పడేసింది. శ్వేతా వర్మ లోబో మరియు హమీద ని తిట్టి పడేసింది. ఇద్దరు ఫేక్ అని అందరి ముందర చెప్పింది. హమీద మరియు లోబో మొఖం మీద రంగు గట్టిగ కొట్టేసింది. హమీద ఏడ్చేసింది బ్రేక్.
10:56PM :- బ్రేక్ తర్వాత యని మాస్టర్ మరియు లహరి చపాతీ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. తర్వాత రాత్రి 11:30 నిమిషాలకు శ్వేతా వర్మ హమీద కి క్లారిటీ ఇస్తుంది. ప్రియా హ్యుమానిటీ గురించి చెప్తుంది. శ్వేతా వర్మ అందరి ముందర హామీదకి సారీ చెప్పింది.
తర్వాత షణ్ముఖ్ వచ్చి ఉమా దేవి హౌస్ కి కరెక్ట్ కాదు అని నామినేట్ చేసాడు. రెండవ అభ్యర్థిగా జెస్సీ ని నామినేట్ చేసారు. తర్వాత కాజల్ వచ్చి యని మాస్టర్ మరియు విశ్వా ని నామినేట్ చేశారు. ఇద్దరు నిన్న నాగార్జున గారి ముందర తన ఫోటో ని గట్టిగ చింపినందుకు.
ప్రియా వచ్చి సన్నీ ని సేఫ్ గేమ్ ఆడుతున్నావని మరియు నటరాజ్ మాస్టర్ ని ఇన్ఫ్లుయెన్స్ కాను అని నామినేట్ చేసింది. తర్వాత జెస్సీ వచ్చి శ్రీరామ్ ని లాస్ట్ వీక్ నామినేట్ చేసారని ఈ వీక్ నామినేట్ చేశారు. రెండవ కంటెస్టెంట్ గా లోబో ని నామినేట్ చేశారు. శ్రీరామ్ వచ్చి నటరాజ్ మాస్టర్ ని మరియు కాజల్ ని నామినేట్ చేశారు. తర్వాత రవి వచ్చి ప్రియాంక ని మరియు శ్రీరామ్ ని పాజిటివ్ గా నామినేట్ చేశారు బ్రేక్.
11:06PM :- బ్రేక్ తర్వాత నటరాజ్ మాస్టర్ వచ్చి గుంత నక్క మేక రూపం లో వచ్చి 7 మందిని చెడగొటింది నన్ను నామినేషన్ చేపించడానికి అని కంటెస్టెంట్స్ ని కథ రూపం లో చెప్పారు. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి వూల్ఫ్ నుంచి ఉమా , నటరాజ్ మరియు కాజల్ టీం ఈగల్ నుంచి లోబో , ప్రియాంక యని మరియు ప్రియా. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో ముగిసింది. ఇలా ఈరోజు బిగ్ బాస్ సమాప్తం.
overall :- మొత్తానికి ఈరోజు బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో శ్వేతా వర్మ , ఉమాదేవి తప్ప మిగితా కంటెస్టెంట్స్ అందరు సిల్లీ రీసన్స్ ఇచ్చారు.
Vote your Favourite Contestants
[poll id=”5″]