telugu bigg boss

Episode 13 Telugu Bigg Boss Season 5 Live Updates – Day12

bigg-boss-live-Updates

Telugu Bigg Boss Season 5 Episode 13:

10:25PM:- ఉదయం 8 గంటలకు కంటెస్టెంట్స్ అందరిని ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని దోస్తీ పాటతో బిగ్ బాస్ నిద్ర లేపగా కంటెస్టెంట్స్ తమదైన స్టైల్ లో డాన్స్ వేశారు. తర్వాత కంటెస్టెంట్స్ లగ్జరీ బడ్జెట్ ఐటెం చూసి డిస్కస్ చేస్తున్నారు. తర్వాత ప్రియా ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ గురించి చెప్పారు. టాస్క్ పేరు బాల్ పట్టు లగ్జరీ బడ్జెట్ కొట్టు.

టీవీ లో కంటెస్టెంట్ పేరు రాగానే లగ్జరీ ఐటెం నుంచి వచ్చే బాల్ ని పట్టుకోవాలి లేని యెడల ఆ బాల్ మీద ఉన్న లగ్జరీ ఐటెం రాదు. ఉదయం 11:30 నిమిషాలకు విశ్వా మానస్ ని నెగటివ్ వే లో చూస్తున్నారు . మానస్ లో చాల చేంజెస్ వచ్చాయి. నెగటివ్ ఇంప్రెషన్ వస్తుంది అన్నారు.

తర్వాత జెస్సీ మరియు శ్వేతా వర్మ టాస్క్ గురించి డిస్కస్ చేస్తున్నారు. జెస్సీ బాగా కామెడీ చేస్తున్నారు.

మధ్యాహ్నం 1:30 నిమిషాలకు బిగ్ బాస్ ఒక బెస్ట్ పెరఫార్మెర్ మరియు ఒక వరస్ట్ పెరఫార్మెర్ పేరు చెప్పమంటే విశ్వా బెస్ట్ గా షణ్ముఖ్ , శ్రీరామ్ బెస్ట్ గా నటరాజ్ మాస్టర్ పేరు చెప్పారు.

10:41PM :- బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 12:45 నిమిషాలకు జైలు లో ఉన్న సన్నీ ని లహరి ఓదారుస్తుంది. సన్నీ బాధ పడుతున్నారు. రవి , లహరి వింటున్నారు. తర్వాత కాజల్ మరియు ప్రియా మధ్య వాషింగ్ మీద డిస్కషన్ జరుగుతుంది. ప్రియా కాజల్ తో మాట్లాడటానికి ఇష్టపడకుండి.

బిగ్ బాస్ టీవీ లో నటరాజ్ మాస్టర్ పేరు వచ్చింది. మాస్టర్ పరిగెత్తి రెండు లగ్జరీ బాల్స్ పట్టేసుకున్నారు. కంటెస్టెంట్స్ అందరు ఆనందం తో గంతులు వేస్తున్నారు. తర్వాత టీవీ లో ప్రియాంక పేరు చెప్పగా ప్రియాంక కూడా బాల్ పట్టేసుకుంది. కంటెస్టెంట్స్ ఆనందం తో చిందులేస్తున్నారు.

కాజల్ మరియు ప్రియా మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. విశ్వా కి లింక్ చేస్తున్నారని విశ్వా కాజల్ పైన సీరియస్ అయ్యారు. కాజల్ డబల్ మైండెడ్ అని మరల ప్రియా ప్రూవ్ చేసింది.

సాయంత్రం 4:30 నిమిషాలకు రవి కాజల్ ని ఓదారుస్తున్నారు. కాజల్ ఏడుస్తున్నట్లు నటిస్తుంది. ప్రియా వచ్చి కాజల్ కి సారీ చెప్తుంది. తర్వాత టీవీ లో యని మాస్టర్ పేరు చెప్పగా నటరాజ్ మాస్టర్ వెళ్లి పట్టుకున్నందుకు ఆ బాల్ లెక్కలో లేదు.

తర్వాత సాయంత్రం 6:30 నిమిషాలకు రవి బిగ్ బాస్ పంపిన పేపర్ చదువుతున్నారు. టాస్క్ పేరు బి బి న్యూస్. రవి మరియు కాజల్ రిపోర్టర్స్ గా చేస్తారు. ఇంటి సభ్యులు వారి అనుభవాలు చెప్పాలి. రవి మరియు కాజల్ రిపోర్టర్స్ గా స్టార్ట్ చేశారు. రవి కాజల్ తో కామెడీ చేస్తున్నారు. రవి కాజల్ , విశ్వా ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. విశ్వా విలన్ కాజల్ అని మరియు లవర్ గా ఎవరు లేరు అని చెప్పారు. కాజల్ మరియు రవి కామెడీ చేస్తున్నారు. రాత్రి 8 గంటలకు కాజల్ యని మాస్టర్ ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. యని మాస్టర్ మరియు శ్వేతా వర్మ బాండింగ్ గురించి అడుగుతున్నారు . యని మాస్టర్ లవ్ స్టోరీ గురించి చెప్పారు.

తర్వాత లోబో రవి కలిసి కామెడీ చేస్తున్నారు. తర్వాత ప్రియా మరియు నటరాజ్ మాస్టర్ పైన ఇంటర్వ్యూ చేశారు. మేక కుందేలు పులి ఎవరు అని అడిగారు. అక్కడ కూడా కామెడీ చేస్తున్నారు. ఇప్పుడు లోబో మరియు ఉమాదేవి మధ్య లవ్ ట్రాక్ మీద కామెడీ చేస్తున్నారు.

తర్వాత రవి కాజల్ కలిసి శ్రీరామ్ చంద్ర ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎవరిని లవ్ చేస్తున్నారు అని , హమీద , లహరి మీద ఇలా వారం వారం మారుతుంటుంది . శ్రీరామ్ వైఫ్ గా అయితే ప్రియా మరియు లహరి , గర్ల్ ఫ్రెండ్ గా సిరి , ఫ్రెండ్ గా శ్వేతా , పనిమనిషిగా కాజల్ పేరు చెప్పారు. తర్వాత ఇవే ప్రశ్నలు మానస్ ని అడగగా. బెస్ట్ ఫ్రెండ్ సిరి , మరదలు ప్రియక , లహరి వైఫ్ గా , పనిమనిషిగా కాజల్ అని చెప్పారు బ్రేక్.

10:51PM :- బ్రేక్ తర్వాత హమీద ని ఇంటర్వ్యూ చేయగా శ్రీరామ్ చంద్ర భర్తగా రావాలని చెప్పింది. రవి హమీద మీద ప్రశ్నల వర్షం కురిపించారు. రవి సన్నీ కి ప్రశ్నలు అడగగా పని మనిషిగా సిరి , వైఫ్ గా శ్వేతా , గర్ల్ ఫ్రెండ్ గా లహరి అని చెప్పారు ఇవే ప్రశ్నలు జెస్సీ ని అడగగా పనిమనిషిగా కాజల్ పేరు చెప్పారు. గర్ల్ ఫ్రెండ్ గా శ్వేతా పేరు చెప్పారు. రవి మరియు కాజల్ కలిసి లహరి కి వన్ వర్డ్ క్వశ్చన్ అడిగారు. లహరి సమాధానం ఇచ్చింది. శ్రీరామ్ మీద రవి కామెడీ చేస్తున్నారు.

రాత్రి 11 గంటలకు టీవీ లో షణ్ముఖ్ పేరు రాగ షణ్ముఖ్ బాల్స్ పెట్టేసుకున్నారు. కంటెస్టెంట్స్ అందరు షణ్ముఖ్ కి స్విమ్మింగ్ పూల్ లో పడేసారు ఆనందం తో బ్రేక్.

11:00PM :- బ్రేక్ తర్వాత రాత్రి 12:00 గంటలకు యని మాస్టర్ డైరెక్షన్ చేయగా ప్రియాంక కుమారి 21F సినిమా డైలాగు చెప్పింది. తర్వాత హమీద మరియు శ్రీరామ్ కలిసి మనోహర సాంగ్ కి డాన్స్ వేశారు. కంటెస్టెంట్స్ అందరు వీరి పెర్ఫార్మన్స్ కి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇలా వీరి డాన్స్ తో ఈరోజు బిగ్ బాస్ సమాప్తం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button