telugu bigg boss

Episode 12 Telugu Bigg Boss Season 5 Live Updates – Day11

Bigg Boss Season 5 Episode 12 Day 11: రెండవ వారం లో కంటెస్టెంట్స్ అడుగుపెట్టినప్పటినుంచి ప్రతిరోజూ గొడవలే. ఒకరికి ఒకరు కొట్లాడుకోవడమే. ఇదే తంతు నడిచింది. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో చుస్తే ఫన్ ఎక్కువ ఫైట్స్ తక్కువ అన్నట్లు అనిపిస్తుంది. చూడాలి మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో.. రిఫ్రెష్ చేస్తూ ఉండండి లైవ్ అప్డేట్స్ ఇయడానికి మేము రెడీ గా ఉన్నాం మరి మీరు రెడీ నా

10:00PM :- ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో 10:00PM నిమిషాలకు అగ్గిపుల్ల న మజాకా అనే మూడవ టాస్క్ గురించి ఉమాదేవి చెప్తుంది. రెండు టీమ్స్ ఆడాలి. బ్లూ టీం నుంచి సిరి మరియు ప్రియాంక కలిసి ఒక పక్క అడగ , యెల్లో టీం నుంచి కాజల్ మరియు నటరాజ్ మాస్టర్ కలిసి ఆడుతున్నారు. అగ్గిపుల్లలు ఆర్డర్ గా పెటేసి యెల్లో టీం అగ్గి పెటేసారు. బ్లూ టీం ఇంకా అగ్గిపుల్లలు పెడుతూనేఉన్నారు. కానీ చివరికి ఈ టాస్క్ లో బ్లూ టీం గెలిచారు.

రాత్రి 10:45PM నిమిషాలకు శ్వేతా వర్మ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు. తర్వాత బ్లూ టీం వాళ్ళకి బిగ్ బాస్ ఫ్లాగ్ పంపించారు. బ్లూ టీం వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఇద్దరి టీం కి ఎన్ని, ఎన్ని ఫ్లాగ్స్ ఉన్నాయో చెప్పమనగ ఎక్కువ ఫ్లాగ్స్ ఉన్న బ్లూ టీం ని గెలిచారని బిగ్ బాస్ అభినందిస్తున్నారు.

కెప్టెన్సీ పోటీదారుల కోసం టాస్క్ పూర్తయింది. తర్వాత శ్వేతా వర్మ పుట్టిన రోజు కానుకగా బిగ్ బాస్ శ్వేతా వాలా నాన్న విషెస్ వీడియో చూపించారు. శ్వేతా వర్మ ఫుల్ హ్యాపీ అయింది. రాత్రి 12:30 నిమిషాలకు మానస్ మరియు లహరి మాట్లాడుకుంటున్నారు. అందరు పడుకున్నారు.

మరుసటి రోజు 11:00AM కి బిగ్ బాస్ క్రాక్ సినిమా లోని ఐటెం సాంగ్ తో కంటెస్టెంట్స్ ని నిద్ర లేపగా కంటెస్టెంట్స్ తమదైన స్టైల్ లో డాన్స్ వేస్తున్నారు. తర్వాత మానస్ లహరికి మసాజ్ చేస్తున్నారు. తర్వాత లోబో మరియు ఉమాదేవి కామెడీ చేస్తున్నారు మధ్యలో యని మాస్టర్ కూడా చేరి కామెడీ చేస్తున్నారు.

మధ్యాహ్నం 12:45 నిమిషాలకు బిగ్ బాస్ బ్లూ టీం ని అభినందించి టీం లీడర్ అయినా శ్రీరామ్ కి అతని టీం సభ్యులలో క్యాప్టియన్ అవ్వడానికి ఎవరు అర్హులో 4 పేర్లు చెప్పండి అని చెప్పగా శ్రీరామ్ విశ్వా , యని మాస్టర్ , హమీద మరియు ప్రియాంక పేర్లు చెప్పారు బ్రేక్.

10:40PM :- బ్రేక్ తర్వాత మద్యనం 3:30 నిమిషాలకు శ్వేతా వర్మ కెప్టెన్సీ టాస్క్ వివరిస్తున్నారు. టాస్క్ పేరు కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి. ఈ టాస్క్ లో కెప్టెన్సీ టాస్క్ కి పోటీ చేస్తున్న సభ్యుల ఎదురుగ బీకేర్ పెడతారు. కంటెస్టెంట్స్ కొబ్బరికాయ కొడుతూ ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో వారి బీకర్ లో కొబ్బరి నీళ్లు నింపాలి. పోటీ దారులు కంటెస్టెంట్స్ ని రిక్వెస్ట్ చేసారు. బిగ్ బాస్ సైరన్ మోగించారు. కంటెస్టెంట్స్ కొబ్బరికాయ కోటి వారి ఫేవరెట్ కంటెస్టెంట్ బీకర్ లో కొబ్బరి నీళ్లు నింపుతున్నారు. విశ్వా బీకర్ నిండిపోయింది.

సాయంత్రం 4:15 నిమిషాలకు ఉమాదేవి మరియు సన్నీ మధ్య మాటల యుద్ధం మొదలయింది. సంచాలకులుగా ప్రియా ఈ టాస్క్ విజేత గ విశ్వా పేరు ప్రకటించారు. బిగ్ బాస్ విశ్వా ని తదుపరి కెప్టెన్ గా ప్రకటించి అభినందించారు.

తర్వాత సిరి సన్నీ పైన నెగటివ్ గా మాట్లాడుతుంది. తర్వాత రవి హమీద ని పొగుడుతున్నారు. మధ్యలో షణ్ముఖ్ మీద కామెడీ చేస్తున్నారు. రవి హమీద ముందర షణ్ముఖ్ ని బుక్ చేస్తున్నారు. కామెడీ చేస్తున్నారు. షణ్ముఖ్ మీద రవి ఫుల్ కామెడీ చేస్తున్నారు.

రాత్రి 7:15 నిమిషాలకు రవి బిగ్ బాస్ పంపిన మెసేజ్ చదువుతున్నారు. హౌస్ లో లాక్ వేసి ఉన్న ఒక సింగల్ బెడ్ ని సొంతం చేసుకోవాలంటే ఉమా మరియు లోబో టాస్క్ చేయవలసి ఉంటుంది. ఇద్దరు కామెడీ చేసి , కంటెస్టెంట్స్ ని ఎంటర్టైన్ చేసి ఎవరు ఎక్కువ నవ్విస్తే వారికీ ఆ బెడ్ దక్కుతుంది.

రాత్రి 9:10 నిమిషాలకు మొదటిగా లోబో మరియు ప్రియాంక కలిసి కామెడీ స్కిట్ స్టార్ట్ చేశారు. లోబో ఆటో డ్రైవర్ గా స్కిట్ మొదలుపెట్టారు. లోబో ప్రియాంకతో కలిసి కామెడీ చేస్తున్నారు. కంటెస్టెంట్స్ ని లోబో మరియు ప్రియాంక కలిసి ఫుల్ గా నవ్విస్తున్నారు బ్రేక్.

10:53PM :- బ్రేక్ తర్వాత ఉమాదేవి కామెడీ స్కిట్ మొదలుపెట్టింది. అత్త కోడలా మధ్య స్కిట్. అత్త గా ఉమాదేవి కోడలిగా సిరి చేస్తుంది. అత్త కోడలా మధ్య సంబంధం ఎలా ఉంటుందో అని బ్రమలో మరియు రియాలిటీ లో చూపిస్తున్నారు. ఉమాదేవి మరియు సిరి కలిసి కామెడీ బాగా చేస్తున్నారు. ఉమాదేవి ఫుల్ గా నవ్విస్తుంది.

విశ్వా లీడ్ తీసుకొని ఓటింగ్స్ వేయమన్నారు కంటెస్టెంట్స్ ని.

ఎక్కువ నవ్వించిన కంటెస్టెంట్ గా లోబో ని ఎంపిక చేశారు. సింగల్ బెడ్ ట్రోఫీ విశ్వా లోబో కి ఇచ్చారు. లోబో సింగల్ బెడ్ ఉమా కి ఇచ్చి ఐ లవ్ యు చెప్తున్నారు కామెడీ గా బ్రేక్.

11:03PM :- బ్రేక్ తర్వాత రాత్రి 10:00 గంటలకు కంటెస్టెంట్స్ అందరు లోబో ని అభినందిస్తున్నారు. లోబో కీ తో లాక్ చేసిన బెడ్ ని ఓపెన్ చేశారు. బిగ్ బాస్ సీటిమార్ సీటిమార్ అని దువ్వాడ జగన్నాధం సినిమా పాట వెయ్యగా కంటెస్టెంట్స్ డాన్స్ వేశారు.

తర్వాత షణ్ముఖ్ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసారు. కేక్ కట్ చేసి అందరు తినిపించారు. తర్వాత షణ్ముఖ్ పేరెంట్స్ విషెస్ వీడియో చూపించారు. తర్వాత దీప్తి సునైనా వీడియో కూడా చూపించారు. సునైనా షణ్ముఖ్ కి విషెస్ తో పాటు ఐ లవ్ యు చెప్పింది. కంటెస్టెంట్స్ అందరు షణ్ముఖ్ ని ఆటపటిస్తున్నారు. ఇంతటితో ఈరోజు బిగ్ బాస్ సమాప్తం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button