Tesla India: కార్ లవర్స్ కి గుడ్ న్యూస్… ప్రపంచంలో అగ్ర కుబేరుని కంపెనీ ఇండియాలోకి ఎంట్రీ…!

Tesla India: ఈ ఏడాది బిలియనియర్స్ ఇండెక్స్ ను బ్లూమ్ బెర్గ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టెస్లా ,స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ని సంపదలో వెనక్కు నెట్టి ప్రపంచంలోనే అగ్ర కుబేరుడు గా నిలిచాడు.

ప్రపంచంలోని ఎంతో పేరుగాంచిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా కంపెనీ ఇండియాకి రాబోతున్నట్టు టెస్లా యాజమాన్యం ప్రకటించింది. ఈ టెస్లా కంపెనీని కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో టెస్లా ఇండియా మోటార్స్ మరియు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

అసలికి 2018 లోనే ఇండియాలో టెస్లా ను ఏర్పాటు చేయాలని ఎలాన్ మస్క్ ప్రయత్నించారు. కానీ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ .. తమకు చాలా అడ్డంకిగా ఉన్నాయని ఎలాన్ మస్క్ భారత్లో టెస్లా కంపెనీని పెట్టాలనే ఆలోచనను విరమించుకున్నారు.

కానీ తాజాగా మళ్లీ ఎలాన్ మస్క్ ఇండియా పై దృష్టి సారించగా.. ఎట్టకేలకు ప్రభుత్వ ఆర్డర్ లభించడంతో ఇండియాలో టెస్లా కంపెనీ ఏర్పాటు కానున్నది. దీంతో టెస్లా కారు అభిమానులు ట్విట్టర్లో “టెస్లా ఇండియా” అనే హాష్ టాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.