Political News
ఎన్నికల కమీషనర్‌ను ఇంటికి పంపించాలి : బండి సంజయ్

hyderabad : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పడిపోవడానికి టీఆర్ఎస్సే పార్టీ కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ తో పాటు వారి మంత్రులు ప్రజలను భయపెట్టారని సంజయ్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ లో పోలింగ్ శాతాన్ని తగ్గించే కుట్ర కేసి ఆర్ చేసారని అందుకనే ఇలా జరిగిందని బండి సంజయ్ మండి పడ్డారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీపీఐ, సీపీఎం గుర్తు పట్టలేని మొద్దు నిద్రలో ఉందన్నారు. ఎన్నికల కమిషన్ ను సస్పెండ్ చేసి ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు.