Edit pdf files on online in telugu
Edit pdf files on online in telugu
ఉచితంగా PDF ఫైల్స్ ని చదవడానికి అడోబ్ అక్రోబాట్ ని ఎప్పటినుండో యూస్ చేస్తున్నాము. అయితే PDF ను ఎడిట్ చేయడానికి మాత్రం సాఫ్ట్ వేర్ యొక్క పెయిడ్ వర్షన్ ని కొనాల్సి ఉంటుంది.
కాని ఒకవేళ మీరు పెయిడ్ వర్షన్ ని వద్దు అనుకుంటే మరియు ఇప్పటికీ మీరు PDF లతో పని చేయాలి అనుకుంటే, వాటిని సులభంగా ఎడిట్ చేయాలి అనుకుంటే దాని కోసం ఒక ప్రత్యామ్నాయo ఉంది. అడోబ్ అక్రోబాట్ లేకుండానే మీ PDF ఫైళ్ళను ఎడిట్ చేయడానికి ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది.
కింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి మరియు సులభంగా PDF ఫైళ్ళను ఎడిట్ చేసుకోండి:
మొదట, ఎడిట్ చేసే ప్రక్రియను ప్రారంభించడానికి మీ PDF ఫైల్ ని Google డ్రైవ్ లో అప్ లోడ్ చేయాలి.
PDF ఫైల్ ని Google డ్రైవ్ లో అప్లోడ్ చేయడానికి, మీ కంప్యూటర్ లో ఎక్కడైతే ఫైల్ ని సేవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ లొకేషన్ ని బ్రౌస్ చేసి న్యూ అనే దాని పైన క్లిక్ చేసి ఫైల్ ని అప్లోడ్ చేయాలి.
ఫైల్ ని అప్లోడ్ చేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ Google డ్రైవ్ లో ఫైల్ కి వెళ్లి రైట్ క్లిక్ క్లిక్ చేయండి.
ఆ తర్వాత మీరు ఓపెన్ విత్ Google డాక్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
Google డాక్స్ లో ఫైల్ తెరిచిన వెంటనే అవసరమైన మార్పులు చేసుకోవచ్చు మరియు ఆపై ఫైల్ ని PDF లేదా Word డాక్యుమెంట్ గా లేదా మీకు కావలసిన ఇతర ఫైల్ ఫార్మాట్ గా సేవ్ చేయవచ్చు.
అయితే, ఈ పద్ధతిని ఉపయోగించే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. టెక్స్ట్ కలిగి ఉన్న PDF ఫైల్స్ కి మాత్రమే పైన చెప్పిన ప్రాసెస్ బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఒక ఫార్మ్ ని ఎడిట్ చేస్తే అప్పుడు ఎడిటింగ్ తర్వాత అందులోని కొన్ని ఫీల్డ్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. దీనితో పాటు, PDF ఫైల్ లో ఏదైనా ఇమేజస్ లేదా ఫాన్సీ టెక్స్ట్ ఫార్మాట్ ఏదైనా కలిగి ఉంటే అవి కూడా కనిపించవు.
మరి ఫ్రీగా ఆన్లైన్ లో టెక్స్ట్ మాత్రమే ఉన్న PDF ఫైల్స్ ను సులభంగా పైన చెప్పిన పద్ధతిలో ఎడిట్ చేసుకోండి.