News
రాజధాని చుట్టుపక్కల భూ ప్రకంపనలు… ఇండ్ల నుండి పరుగులు తీసిన ప్రజలు…!

Earth Quake In Amaravathi: ఏపీ రాజధాని అమరావతి చుట్టూ పక్కన ప్రాంతంలో భూమి కంపించింది. చుట్టూ పక్కల ఉన్న పలు గ్రామాల్లో తెల్లవారుజామున 5గంటలకు భూప్రకంపనలు మొదలయ్యాయి.
తాడికొండ, తుళ్ళూరుతో పాటు తుళ్ళూరు, రాయపూడి, నెక్కల్లు, బడెపురం, కార్లపూడి ప్రాంతాలలో ఒక్కసారిగా శబ్దాలు చేస్తూ భూమి కంపించింది.
ఈ విషయాన్నీ పసిగట్టిన కొంతమంది ప్రజలు భయందోళనకు లోనై ఇళ్ళ నుంచి బయటికి పరుగులు పెట్టారు. ఈ విషయాన్ని స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి చేరుకొని భూప్రకంపనలు ఎక్కడ నుంచి వచ్చాయి. ప్రకంపనలకు గల కారణాలను దర్యాప్తు చేపడుతున్నారు.