telugu gods devotional information in telugu

నేటి ద్వాదశి నాటి ఆరాధన క్రమం

కార్తీక శుద్ధ ద్వాదశినాడు చెయాల్సినవిధి

కార్తీక మాసం హరిహరులకు ఇష్టమైన మాసం.హరిహరుల కృప ఏకకాలంలో పొందేందుకు అనువైన కాలం ఇది.ఇక ఈరోజు ద్వాదశినాడు చేయాల్సింది ఏమంటే నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్నవారు నేడు ద్వాదశినాడు పారాయణ పేరుతో అన్న సంతర్పణలు చేస్తారు.బ్రాహ్మణులకు యధాశక్తి దానాలు చేయాలి.

పురాణాల ప్రకారం ఈరోజు పుణ్య నది స్నానం వల్ల అమోఘ పుణ్యం లభిస్తుందని,ఈరోజు పాలకడలిని చిలికిన రోజు అని మహావిష్ణువు లక్ష్మి స్వరూపం అయిన తులసి మాత కోసం బృందావనప్రవేశం చేస్తాడు.ధాత్రి అనబడే పేరుతో ఉసిరి మొక్కను నారాయణ స్వరూపంగా,తులసి ని లక్ష్మి రూపంగా భావించి ఒకె దగ్గర ఉంచి పూజ చేస్తారు.కల్యాణం కుడా చేస్తారు.ఒకవేళ ఉసిరి మొక్క అందుబాటులో లేకుంటే విష్ణుమూర్తి ప్రతిమ లేదా పటాన్ని ఉంచాలి.లేదా బృందాదేవి శాపం వల్ల ఏర్పడిన సాలగ్రామాన్ని ఉంచి ఆరాధన చేయాలి.
ఓం నమో నారాయణాయ

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button