telugu gods devotional information in telugu
dwaadshi visheshas
ఈరోజు ద్వాదశి విశేషాలు

dwaadshi visheshas
ఈరోజు మార్గశిర బహుళ ద్వాదశి సౌమ్య వారంతో కూడి యున్నది.
ఈరోజు తిధి మరియు రెండు కూడా విష్ణుమూర్తి కి ప్రియమైనవి.నిన్న ఏకాదశి వ్రతం లేదా ఉపవాసం ఆచరణ చేసిన వారు ఈరోజు పారాయణ పేరుతో అన్న పానాదులు నారాయణుని పూజ అనంతరం మాత్రమే చేయాలి.ఏలాంటి పరిస్థితులలో కూడా ద్వాదశి గడియలు ఉండగా మాత్రమే అన్నపానాదులు స్వీకరించాలి.లేదంటే ఇంతకుముందు చేసిన ఏకాదశి వ్రతాల ఫలితం పోతుంది.
దీనికి సంబంధించిన పురాణ గాథ ఒకటి అంబరీష మహారాజుది గలదు.ఈ కథవల్ల మనకు ద్వాదశి మహత్మ్యం వల్ల తెలుస్తుంది. కాబట్టి ఈరోజు తప్పకుండా నారాయణ స్మరణ తప్పనిసరి . . . పూజలో ఈరోజు తులసి పత్రాలు కోయరాదు.వీలయినంత అన్న దానం చేయండి. లేదంటే ఐదు పిరికిల్ల బియ్యం, కూరగాయలయినా దానం చేయండి.
ఈరోజు మరొక విశేషం చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో- ఈనాడు మల్ల ద్వాదశి, కృష్ణ ద్వాదశీ వ్రతాలు ఆచరిస్తారని చెబుతోంది.