Tollywood news in telugu

Drushyam 2 OTT Release : మొత్తానికి ఒక క్లారిటీ ఇయ్యబోతున్న దృశ్యం 2 :-

Drushyam 2 OTT Release

Drushyam 2 OTT Release : వెంకటేష్ గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ దృశ్యం. దృశ్యం పార్ట్ 1 ఎంత ఘానా విజయం సాధించిందో అందరికి తెలుసు.

అయితే ప్రస్తుతం దృశ్యం పార్ట్ 2 మలయాళం లో బ్లాక్ బస్టర్ అయ్యింది కూడా. మలయాళం లో విడుదలయి విజయం సాధించిన వారానికే వెంకీ మామ దృశ్యం 2 తెలుగు వెర్షన్ షూట్ మొదలపెడ్తున్నాం అని అనౌన్స్ చేశారు.

అప్పటినుంచి ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకుల ఎదురుచూపులు ఈ సినిమా పైననే ఉన్నాయి. షూటింగ్ కూడా చాల త్వరగానే పూర్తి చేసారు చిత్ర బృందం.

అయితే మొదట్లో ఈ సినిమా హాట్ స్టార్ వాలు సొంతం చేసుకున్నారని డైరెక్ట్ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుందన్నా వార్తలు వచ్చాయి. తర్వాత సినిమాలు థియేటర్లో విడుదల చేయాలనీ , సినీ పరిశ్రమ కోసం ప్రతి సినిమా ఓటీటీ కి విడుదల చేయకుండా థియేటర్ లోనే విడుదల చేయాలనుకున్నారు. అపుడు అందరు దృశ్యం 2 కూడా థియేటర్ లో రిలీజ్ అవుతుందని అందరు అనుకున్నారు.

కానీ ఇప్పుడు వస్తున్నా టాక్ ప్రకారం ఈ సినిమా యొక్క రైట్స్ అమెజాన్ ప్రైమ్ కొనిందని తెలిసింది. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అని చిత్రసీమ లో టాక్ నడుస్తుంది. మొత్తానికి దృశ్యం 2 సినిమా డైరెక్ట్ ఓటీటీ అని కన్ఫర్మేషన్ ఇయ్యబోతున్నారని తెలుస్తుంది.

త్వరలో చిత్రబృందం దీనికి సంబందించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ ఓటీటీ లో రాబోతుందో లేదా థియేటర్ రిలీజ్ ఓ మరి. త్వరలో క్లారిటీ వస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button