Drushyam 2 Review and Rating | హిట్టా ఫట్టా :-

Movie :- Drushyam 2 (2021) Review
నటీనటులు :- వెంకటేష్ , మీన , ఎస్తర్ అనిల్ , కృతిక జయకుమార్ , నదియా , నరేష్ మొదలగు.
నిర్మాతలు :- సురేష్ బాబు
సంగీత దర్శకుడు :- అనూప్ రూబెన్స్
డైరెక్టర్ :- జీతు జోసెఫ్
ముఖ్య గమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.
Story ( Spoiler Free ) :-
ఈ కథ మొదటి భాగం ఎక్కడ ముగిసిపోయిందో అక్కడినుంచే మొదలవుతుంది. పోలీస్ స్టేషన్ నిర్మాణం జరుగుతున్నా చోట రాంబాబు ( వెంటెష్ ) నదియా కొడుకు అయినా వరుణ్ యొక్క బాడీ కి పాతిపెట్టి మర్డర్ కేసు నుంచి బయటపడతారు. కట్ చేస్తే 6 సంవత్సరాల తర్వాత మళ్ళి ఈ కేసు రి-ఓపెన్ చేస్తారు.
ఇంతకీ తన కొడుకుని చంపినా హంతకుడు ఎవరు ? తన కొడుకు బాడీ కూడా ఇంతవరకు దొరకలేదు అని నదియా బాధపడుతూ , ఎలాగైనా తెలుసుకోవాలి అని పోలీస్ అధికారి అయినా సంపత్ ని ఈ కేసు హ్యాండిల్ చేయమని కోరగా , సంపత్ రాంబాబు పైన బలమైన ఆధారాలతో అతని అరెస్ట్ కి సర్వం సిద్ధం చేస్తాడు.
ఇప్పుడు మరల రాంబాబు ఈ కేసు నుంచి ఎలా బయటపడగలడు ? తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలడు ? అస్సలు సంపత్ కి దొరికిన అధరాలు ఏంటి ? ఎలా మళ్ళి రాంబాబు మీద కేసు పెట్టగలిగారు ? చివరికి ఎం జరిగింది ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో చూడాల్సిందే.
Positives 👍 :-
- ఎప్పటిలాగే వెంకటేష్ తన మార్క్ నటనతో ప్రేక్షకులను స్క్రీన్ కి కట్టిపడేస్తరు. మీన , నదియా , సంపత్ , ఇద్దరు కూతుర్లు మధ్య జరిగే ఈ సినిమాలో అందరూ ది బెస్ట్ ఇచ్చారు. మిగితా పాత్రధారులు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
- జీతు జోసెఫ్ మార్క్ దర్శకత్వం. కథ మరియు కథనం నడిపిన విధానం చాల బాగుంది.
- ముఖ్యంగా చివరి 30 నిముషాలు టెన్షన్ పీక్స్ లో ఉండేలా చూసుకున్నారు.
- సినిమాటోగ్రఫీ బాగుంది.
- ఎడిటింగ్ బాగుంది.
Negatives 👎 :-
- నిడివి ఎక్కువ మరియు మొదటి భాగం కాస్త స్లో గా ఉంటుంది.
Overall :-
మొత్తానికి దృశ్యం 2 సినిమా అందరి అంచనాలను మించి అలరిస్తుంది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. మొదటి భాగం ముగిసిన చోటు నుంచి రెండవ భాగం మొదలవడం , మళ్ళీ రాంబాబు మీద కేస్ పడటం , ప్రతి సన్నివేశాలు చాలా గ్రిప్పింగ్ గా తీశారు.
ఎప్పటిలాగే వెంకటేష్ వారి నటనతో ప్రేక్షకులను స్క్రీన్ కి కట్టిపడేస్తరు. మీన , నదియా, సంపత్ , ఇద్దరు కూతుర్లు అందరూ చాలా బాగా నటించారు. దర్శకుడు జీతూ జోసెఫ్ రెండవ భాగం కోసం మంచి ట్విస్ట్ అండ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మొదటి భాగం కాస్త స్లో గా ఉంటుంది. మొత్తానికి దృశ్యం 2 అనే సినిమా ప్రతిఒక్కరు తప్పక చూడవలసిన సినిమా. చివరి 30 నిముషాలు పీక్స్ అందరినీ స్క్రీన్ కి కట్టిపడేస్తుంది. ఈ వారం కుటుంబం అంత కలిసి చూడవలసిన సినిమా.
Rating :- 3.5 /5