Viral news in telugu
Drunk and Drive : డ్రంక్ అండ్ డ్రైవ్ లో రీడింగ్ 94.. కానీ పాలు తాగాడట!
Drunk and Drive : మనం రోజు కొన్ని వార్తలు వింటుంటే ఫన్నీ గా అనిపిస్తాయి… మరి కొన్ని వార్తలు వింటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సంఘటన ఒకటి తాజాగా జరిగింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఒక ప్రాంతంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. అటుగా వస్తున్న ఆయా వాహనాల డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ తో పరీక్షలు చేశారు.

ఈ నేపథ్యంలో ఒక కారు వాహనదారుడు కమలాకర్ అనే వ్యక్తి ని పోలీసులు టెస్ట్ చేయగా.. అతనికి 94 రీడింగ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. ఇంతకు ఏం తాగావ్ అంటూ అప్పుడు పోలీసులు అడగగా తాను పాలు తాగాను అంటూ చెప్పాడు దీంతో అక్కడ ఉన్నారా వారంతా పగలబడి నవ్వారు. పోలీసులు అతనికి కారును స్వాధీనం చేసుకున్నారు. అతన్ని కౌన్సిలింగ్ కి హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.