health tips in telugu

Beauty Tips: ఈ ఆహారం తో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి… ఆ పదార్థాలు ఏంటో ఇపుడు తెలుసుకుందాం…!

Best Foods for Healthy Skin: తమ సౌందర్యాన్ని కాపాడుకోడానికి  చాలామంది ఎన్నో  రకాల ప్రయత్నిస్తూ ఉంటారు. సౌందర్య క్రీమ్స్,  ఫేస్ ప్యాక్‌‌లు, చేసుకుంటూ అందాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేస్తారు. కానీ వైద్య నిపుణులు వీటన్నిటికీ బదులు మంచి ఆహరం తీసుకోవడం మేలు అని అంటున్నారు. మంచి ఆహారాన్ని తీసుకోవడం తో అందమే, కాదు ఆరోగ్యం కూడా బాగుంటుంది.

ఇక ఇపుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మీ చర్మం మెరుస్తుందో, ఎలాంటి పోషకాలు అందుతాయో  తెలుసుకుందాం.. 

క్యారెట్..

Best Foods for Healthy Skin

ప్రతీరోజు క్యారట్ ని తినడం వల్ల , లేదంటే జ్యూస్ గా చేసి తాగడం వల్ల మీ శరీరానికి విటమిన్‌ C పుష్కలంగా అందుతుంది. అదేవిదంగా  ఇది కొల్లాజెన్‌ ప్రొటీన్‌ తయారీకి దోహదపడుతుంది. మీ  చర్మాన్ని మృదువైన సౌందర్యాన్ని అందిస్తుంది.

పాలకూర..

పాలకూరను కనీసం వారానికి రెండు సార్లు ఆహారంలో తీసుకోవడం వల్ల , ఇందులో ఉండే విటమిన్‌ ఎ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు అన్ని రకాల స్కిన్‌ ఇన్‌ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.   అలాగే మెరిసే చర్మాన్ని మీ సొంతం చేస్తుంది. పాలకూరలో ఉండే ఐరన్‌ రక్త హీనతను నివారించి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

Read  ఎలా నిద్రించే వారిలో రొమాన్స్ "కాముకత్వం," ఎక్కువంటే?

అవకాడో…

 ఈ అవకాడో తీసుకోవడం వల్ల మీ శరీరంలోకి విటమిన్ E , ఆయిల్ పదార్థాలు , ఎక్కువ మొత్తం లో చేరి , మీ  చర్మ కణాలను సమర్థంగా పనిచేసేలా చేస్తాయి.

గ్రీన్‌ టీ..

గ్రీన్ టీలో ప్రతీరోజు తాగడం వల్ల దీనిలో ఉండే  యాంటీ ఆక్సిడెంట్లు , ముసలి తనం త్వరగా రాకుండా కాపాడుతుంది. చర్మ ముడతలను నివారిస్తుంది. అలాగే చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

బాదం..

బాదం ను రోజు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తీసుకోవడం వల్ల మీ  చర్మానికి తేమను అందిస్తుంది. అలాగే చర్మం  పొడిబారకుండా చేస్తుంది. అదేవిదంగా  వీటిలో సమృద్ధిగా లభించే విటమిన్‌ E  అతినీలలోహిత కిరణాల నుంచి మీ చర్మాన్ని కాపాడుతుంది. ఫలితంగా మీ అందాన్ని కాపాడుతుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button