Tollywood news in telugu

RRR Ramcharan – అభిమానులకు డబల్ ధమాకా:-

RRR Ramcharan: ఈ మద్యకాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి, అయన చేయబోయే సినిమాల గురించే ఎక్కడ చుసిన ప్రజలు చర్చిస్తున్నారు. ఒక పక్క రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ఇంకో పక్క శంకర్ సినిమా.

ప్రస్తుతం చరణ్ చేసే ప్రతి సినిమా ఫ్యాన్ ఇండియా లెవెల్లోనే ఉండటం విశేషం. ఇటీవలే చరణ్ , శంకర్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని తీసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఇదిలా ఉండగా నిన్నటినుంచి సోషల్ మీడియా లో శంకర్ సినిమాలో చరణ్ పాత్రా మీద పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటే శంకర్ సినిమా లో రామ్ చరణ్ ద్వీపాత్రాభినయం చేయడం.

ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త హల్ చల్ చేస్తుంది. ఇదే కనుక నిజమైతే చరణ్ అభిమానులకి డబల్ ధమాకే. అపుడెపుడో నాయక్ సినిమాలో డబల్ రోల్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

ఇపుడు కూడా డబల్ రోల్ అనే వార్త నిజం అయితే థియేటర్ లో పూనకాలే మరి. చూడాలి చిత్ర బృందం ఈ వార్త మీద స్పష్టత ఎపుడు తెలుపుతదో మరి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button