Today Telugu News Updates
ఈ యాప్ లను అసలు డౌన్లోడ్ చేసుకోవద్దు…!
రోజురోజుకీ కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. ఈ వ్యాధితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ తేవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు ఇటీవలే భారత్లోకి కరోనా వ్యాక్సిన్ వచ్చిందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎవరైనా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకునేవారు ముందుగానే కో-విన్ అనే వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అదే విధంగా కో-విన్ అనే యాప్ లేదని వెబ్సైట్ మాత్రమే అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్,యాప్ స్టోర్ లో ఉండే ఫేక్ కో-విన్ యాప్ లను డౌన్లోడ్ చేయించుకోవద్దని కేంద్రం సూచించింది.