Viral news in telugu

ఆ నాలుగు దేశాల యువతలను ఆలా చేయవద్దు …కారణం ఏంటంటే…!

Don’t do that to the youth of those four countries

వారి దేశంలోని వారిని తప్పితే వేరే ఇతర దేశాలకు చెందిన  మహిళలను వివాహం చేసుకునే విషయంలో సౌదీ ఆరేబియా కీల ఉత్తర్వులు వెలువరిచింది.  చాద్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మాయన్మార్‌కి చెందిన మహిళలను పెళ్లి  చేసుకోవద్దని ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ విషయాన్నీ  పాక్ పత్రిక డాన్ ముద్రించింది. కొన్ని లెక్కల ప్రకారం  పైన తెలిపిన  నాలుగు దేశాలకు చెందిన 6 లక్షల మంది మహిళలు  సౌదీ అరేబియాలో జీవిస్తునట్టు పేర్కొంది.

ఇంతకముందు వరకు పై  నాలుగు  దేశాలకు చెందిన మహిళలను  సౌదీ అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు కూడా లేవు.ఇపుడు సౌదీ అరేబియా ప్రభుత్వం తాజా ఆదేశాల ప్రకారం,  పై  దేశాల మహిళల్ని పెళ్లి చేసుకోవాడానికి కఠిన నిబంధనలు పెట్టమని , మక్కా  పోలీస్ డైరెక్టర్ మేజర్ జనరల్ అసఫ్ అల్-ఖురేషీ అన్నట్టు మక్కా డైలీ తెలిపింది.  సౌదీ అరేబియా యువకులు  విదేశీ మహిళల్ని పెళ్లి చేసుకునేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ కఠిన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందట.

ప్రస్తుతం  విదేశీ మహిళను వివాహం చేసుకోవాలనుకునే కొన్ని నిబంధనలు తప్పవు. అవేంటంటే…  సౌదీ కి చెందిన పురుషులు…ఎట్టిపరిస్థితులలో  ప్రభుత్వానికి దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తును  ప్రభుత్వం  పరిశీలించి ఆమోదించాలో లేదో నిర్ణయిస్తుంది. అలాగే, విడాకులు తీసుకున్న వ్యక్తులు మరో పెళ్లి చేసుకోవాలని భావిస్తే 6 నెలలకు పైగా వెయిట్ చేయాలి.   వయసు 25 ఏళ్లు పూర్తయి ఉంటేనే దరఖాస్తు చేసుకునే వీలుంది.  ఆయా  జిల్లా లకు చెందిన   మేయర్ సంతకం చేసిన దరఖాస్తుతోపాటు గుర్తింపు పత్రాలు ప్రభుత్వానికి  సమర్పించాలి.

ఈ విషయం సౌదీ పౌరులకు కొంత ఇబ్బంది కలిగించిన  ,  అక్కడ ప్రభుత్వం  చెప్పిందే వేదం కాబట్టి వీటిని తూచాతప్పకుండా  పాటించాల్సిందే. ఇపుడు ఈ న్యూస్ ప్రపంచమంతటా హాట్ టాపిక్ గా మారింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button