News
Donald Trump: డోనాల్డ్ ట్రంప్ కి షాక్ ఇచ్చిన ట్విట్టర్

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి నుండి వైదొలిగే సమయంలో..ట్రంప్ కి అన్ని గట్టి షాక్ లే తగులుతున్నాయి. ఇప్పటికే క్యాపిటల్ కార్యాలయంపై ట్రంపు మద్దతుదారులు దాడి చేయడం వల్ల ట్యాంప్ పై తన సొంత పార్టీ వారే అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరి అలాగే క్యాపిటల్ కార్యాలయం దాడి సమయంలో ట్విట్టర్లో ట్రంప్ పెట్టిన ట్వీట్ విద్వేషాలకు దారితీసేలా ఉందని ట్విట్టర్ యాజమాన్యం ఆయన ట్విట్టర్ ఖాతాను జనవరి 20 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ట్విట్టర్ ఓ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్లో ట్రంప్ రూల్సు, గైడ్ లైన్స్ లను అతిక్రమించినందుకు ఆయన ఖాతాను బ్లాక్ చేస్తున్నామని ట్విట్టర్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.
