Tollywood news in telugu
మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో యంగ్ హీరో !

మెగా ఫ్యామిలీ నుండి మరో యంగ్ హీరో రాబోతున్నాడు . ఒక కొత్త డైరెక్టర్ అభిరామ్ దర్శకత్వంలో పవన్‌తేజ్ కొణిదెల హీరోగా థ్రిల్లర్ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ ఉండబోతుంది. ఈ సినిమా కి ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే ఒక ఆసక్తికరమైన పేరును ఖరారు చేసారు.
ఈ మధ్యనే ఈ సినిమా యొక్క టీజర్ కూడా విడుదలచేశారు. పవన్‌తేజ్ సరసన హీరోయిన్‌గా మేఘన నటిస్తుంది . ఈ సినిమాకు నిర్మాత రాజేశ్‌నాయుడు . బాణీలు కార్తిక్ సమకూర్చనున్నాడు. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ టీజర్‌ను చుస్తే పవన్ తేజ్‌ను మాస్ హీరోగా పరిచయం చేయనున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతీ ఒక్కరు వారికంటూ ఒక ఇమేజ్ ని క్రియేటుచేసుకున్నారు. ఇక ఈ సినిమా ద్వారా పవన్ తేజ్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో వెయిట్ చేయాల్సిందే.