Viral news in telugu

Tips For Love Proposing : మీరు ఎవర్నైనా లవ్ చేస్తున్నారా ? కానీ ఏవిదంగా ప్రపోజ్ చేయాలో తెలియక తికమక పడుతూ ఉంటె… ఈ టిప్స్ మీకోసమే…!

Tips For Love Proposing

Tips For Love Proposing : సృష్టిలో ప్రేమించడం కంటే , ప్రేమించబడటం చాల అదృష్టం . కానీ ఆ  ప్రేమను వ్యక్తపరచాలంటే.. చాల మంది యువత తికమక పడుతూ  ఉంటారు. ప్రేమించడం ఒక ఎత్తయితే దానిని వ్యక్తపరచాలంటే తలప్రాణం తోకకు వస్తుంది. ఆ టెన్షన్ కి , ఒక సినిమాలో హీరోయిన్‌కి ప్రేమ విషయం చెప్పడానికి హీరో కి కొన్ని సంవత్సరాలు పడుతుంది.  ప్రేమించడం తేలికే, కానీ ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి గుండెధైర్యం కూడా కావాలి. ఈ రోజుల్లో యువత అన్ని విషయాలలో ఫాస్ట్ గా ఉన్నప్పటికీ, తన ప్రేమ విషయాన్నీ ఒక అమ్మాయికి చెప్పాలంటే చాలా మదనపడిపోతున్నారు. ప్రేమ విషయం చెప్పడానికి రోజుల తరబడి ప్రాక్టీస్ చేస్తూ… చివరికి ఆ అమ్మాయికి పెళ్ళిసంబందాలు వస్తున్నాయి అన్నప్పుడో, లేదంటే వేరే అబ్బాయితో  రేపు పెళ్లి  జరుగుతుందనంగానో చెప్పేస్తున్నారు.

మరి ఇలాంటి టైంలో చెబితే ఏంలాభం , చాల మంది ఇలా ప్రేమవిషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఇక ఇలాంటివి జరుగకుండా  లవ్ ప్రపోజ్ చేసేముందు ప్రియురాలికి ఎలా దగ్గరవాలో  ఈ టిప్స్ పాటించండి … . ఆ తర్వాత మీ పని చాల సులువైపోతుంది.

1. మనము ప్రేమించే అమ్మాయి, ఐన అబ్బాయి అయినా  , తనకి ముందుగా దగ్గరవ్వాలంటే వారి ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలుసుకోవాలి. రెండు మనసులు ఒక్కటవ్వాలంటే వారి  అభిరుచులు కూడా కొంతవరకు కలవాలి. దీనికోసం మీరు ఇష్టపడే వారి ఇష్టాలను తెలుసుకొని అవి తనకి అందేలా చూడండి.   వారికి నచ్చిన ప్రదేశాలకు, సినిమాలకు తీసుకెళ్లండి. వారి అభిరుచులు తెలుసుకొని ,  మీ అభిరుచుల గురించి వారికి తెలియజేయండి.

2. తనతో పాటు , అందరితో  చలాకీగా ,  నవ్వుతూ మాట్లాడటం మరచిపోవద్దు. ఎందుకంటే ఈ విషయంలోనే వారు మీకు దగ్గరవుతారు.  ముఖ్యంగా అమ్మాయిలకు నవ్వుతూ మాట్లాడేవారిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.  సందర్భానికి తగినట్లుగా మాట్లాడుతూ మీ ప్రేమను చెప్పడానికి  ప్రయత్నం చేయండి.

3. మీరు ప్రేమించేవారు దగ్గర ఎప్పుడు నిజాలు చెప్తూ ఉండండి. దీనివల్ల మీపై నమ్మకం ఏర్పడుతుంది.  ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకుండా చూసుకోండి.  ఒకవేళ చెప్పినా తాను కూల్ గా ఉన్నపుడు వారికి అసలు నిజాలు చెప్పేయడం ఉత్తమం.  లేదంటే వారి దృష్టిలో నమ్మకం పొతే తిరిగి సంపాదించడం కష్టం.

4. ఇక ఒక ముఖ్యమైన విషయం వుంది… దీనిని మీరు చాలాబాగా ఉపయోగించుకోవచ్చు. అదేనండి మీరు లవర్ బర్త్ డే , ఈ రోజునాడు మీరు కాస్త డిఫరెంట్ గా విష్ చేసి, ఒక మంచి బహుమతిని ఇవ్వండి. ఇక ఆ రోజునుండి అమ్మాయి మిమ్మల్ని మరచిపోతే ఒట్టు.. బహుమతి ఇవ్వడం అంటే అదేదో ఖరీదైనది అనుకుంటే పొరపాటే… తన ఇష్టాలు మీకు తెలిస్తే, అందులో ఒకటి బహుమతిగా ఇవ్వండి చాలు. పనిలో పనిగా మీ లవ్ ప్రపోజల్ ని కూడా చెప్పేయండి. 

5. ఇంకో ముఖ్య విషయం కూడా ఉంది. తాను ఏ  విషయాలలో ఇబ్బంది పడుతుందో తెలుసుకొని, ఆ ఇబ్బందులను లేకుండా చేయండి. ఇక్కడే మీపై ఆ అమ్మాయికి 100% ఇష్టం ఏర్పడుతుంది. ఇంకా ఇవన్నీ తెలుసుకున్నాకా , ఎందుకు ఆలస్యం వెళ్ళండి వెళ్లి మీరు అనుకున్నది సాధించండి. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button