RRR ప్రతి నాయిక ఇండియాలో ఎం చేస్తుందో తెలుసా?

దర్శకధీరుడు జక్కన్న అలియాస్ రాజమౌళి చెక్కుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, కొమురం భీం గా జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నారు, అలాగే రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ నటి అలియా భట్ ని, జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ని ఎంపిక చేశారు…మరో బాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ దేవగన్ ఆర్ఆర్ఆర్ లో విలన్ గా నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో శ్రియ శరన్, సముథిర ఖని, తదితర నటీ నటులు నటించనున్నారు. డివివి దానయ్య ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తుండగా మరో ప్రధాన పాత్ర కోసం ఐరిస్ నటి అలిసన్ డ్యూటీని రాజమౌళి ఎంపిక చేశారు. ఈమె పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు.
ఈ “ఆర్ఆర్ఆర్” చిత్రంలో అలిసన్ డ్యూటీ బ్రిటిష్ లేడీ స్కాట్ అధికారి పాత్రలో నటించబోతున్నదట… ఈ చిత్రంలో ఆమె పాత్ర కథానాయకులకే సవాళ్ల విసిరే లేడి విలన్ గా ఉండబోతుందట … ఈ చిత్రంలో నటించడానికి అలిసన్ డ్యూటీ ఇండియాకు వచ్చారు….. ఈ మేరకు “లేడీ స్కాట్ హెడింగ్ టూ ఇండియా” అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
భారీ బడ్జెట్ తో, చారిత్రాత్మకమైన కథతో, విలక్షణ నటనలతో “ఆర్ఆర్ఆర్” చిత్రాన్ని దర్శకధీరుడు జక్కన్న చెక్కుతున్నాడు… ఇటీవలే విడుదలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల టీజర్లుకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించింది. ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.