News

happy holi celebration 2021: మన దేశంలో వివిధ రాష్ట్రాలలో హోలీ పండుగను ఏ విధంగా జరుపుకుంటారో మీకు తెలుసా..!

happy holi celebration 2021 మన భారతదేశం విభిన్నజాతులు, సంస్కృతులు, మతాలు, భాషలు,  కలిగిఉన్న దేశం . ఈ రోజు మార్చి 29వ జరుపుకుంటున్న రంగుల హేలీ , రంగోళి పండుగ ఎంతో ఉత్సాహంతో , చిన్న పెద్ద  అని తేడాలేకుండా , వివిధ రంగులను ఉపయోగించి జరుపుకుంటారు. ఈ రంగుల పండుగను మన దేశంలోని వివిధ రాష్ట్రాల వారు వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఈ హోలిని దేశ వ్యాప్తంగా  చెడుపై మంచి గెలుపునకు నిదర్శనంగా , ఆనందంగా డాన్స్ లు చేస్తూ జరుపుకుంటారు. మరి ఈ హోళీ పండగను భారతదేశం అంతటా ఎన్ని విధాలుగా చేసుకుంటారు. హోలీ ని వేరే రాష్ట్రాలలో ఏ విదంగా పిలుస్తారో చూద్దాం…

happy holi celebration 2021

అహ్మదాబాద్‌ కి చెందిన ప్రజలు, ముక్యంగా యువత  ఒకరి భుజాలపై మరొకరు ఎక్కి , పైన  వేలాడుతున్న మజ్జిగ కుండను పగులగొట్టడంతో వేడుకలు మొదలవుతాయి. గతంలో చిన్ని కృష్ణుడు చేసిన చిలిపి పనులను గుర్తుచేస్తుకుంటూ  వేర్వేరు గృహాల నుండి వెన్నను దొంగిలించడం  లాంటివి చేస్తూ హోళీ వేడుకలను సొంతోషంగా జరుపుకుంటారు.

గోవా రాష్ట్రంలో గోవా  ప్రజలు హోలీని ‘ఉక్కులి ‘అని అంటారు. ఇక్కడ  వసంత పండుగ షిగ్మోలో భాగంగా ఈ హోలీని ఎంతో హుషారుగా చేసుకుంటారు.  ఈ పండగను ఏకంగా   నెల రోజుల పాటు జరుపుకుంటారు. వీరు   సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా చేసుకుంటారు.

అస్సాం లో అస్సామీ ప్రజలు హోలీని ‘ఫకువా’ మరియు ‘డౌల్’‌గా 2 రోజులపాటు ఈ పండగను జరుపుకుంటారు.  రాక్షసి హోలిక సంహారానికి ప్రతీకగా మట్టి గుడిసెలను ఏర్పాటు చేసి వీటిని కాలుస్తారు. తరువాతి రోజు రకరకాల  రంగులతో హోలీ ఆడుకుంటారు.  ఈ ఫకువా పేరుతో  బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా పండుగలు  జరుగుతాయి.

ఇక ఉత్తరప్రదేశ్ లో ‘లాథ్మార్’ అనే పేరుతో హోళీ ని విచిత్రంగా జరుపుకుంటారు.  లాథ్మార్ని అంటే  “కర్రలతో కొట్టడం” అని అర్ధం. ఇక్కడి  మహిళలు పురుషులను సరదాగా కొట్టడానికి కర్రలను వాడుతారు.  రాధాతో శ్రీకృష్ణుడు హోళీ ఆడేందుకు ఆమె గ్రామమైన బర్సానాకు వస్తారు. అయితే, రాధా గ్రామస్తులైన స్త్రీలు శ్రీకృష్ణుడిని వెంట పాడుతారు. ఇలా ఇక్కడ  లాత్మార్ హోళీ మొదలవుతుంది. ఇలా కృష్ణుని కలం లో జరిగిన కొన్ని సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ… ఉత్సాహంగా జరుపుకుంటారు.

మణిపూర్ లో హోళీ ని   ‘యోసాంగ్’ గా పిలుస్తారు. ఇక్కడి   స్థానికులు తమ దేవుడైన పఖంగ్బాను గుర్తు చేస్తూ ప్రార్థనలు చేస్తారు. తద్వారా  గుడిసెలను తగలబెడతారు. పిల్లల చేత విరాళాలు సేకరిస్తారు. ఈ వేడుకలో భాగంగా యోసాంగ్ వేడుకలను 5 రోజుల పాటు వివిధ ఆటలతో జరుపుకుంటారు.

పశ్చిమ బెంగాల్  లో హోళీని ‘డోల్ జాత్రా’ అనే పేరుతో పిలుస్తారు. వసంత పండుగైన బసంత ఉత్సవంలో భాగంగా ప్రజలు హోళీ  పండగను చేసుకుంటారు.  డోల్ జాత్రా పేరుతో జరుపుకునే ఈ వేడుకలో భాగంగా ప్రజలు రాధాకృష్ణుల విగ్రహాలను పల్లకిని  పట్టణాలు, గ్రామాల్లో ఊరేగించడంతో హోళీ పండగ మొదలవుతుంది.

పంజాబ్‌ రాష్ట్రంలో ‘హోల్లా మొహల్లా’ పేరుతో హోళీ ని జరుపుకుంటారు.  నిహాంగ్ సిక్కులకు యుద్ధ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తూ.. ఈ పండుగను సిక్కులు మూడు రోజుల ఉత్సాహంగా చేసుకుంటారు.  దీనిని 10 వ సిక్కు మత నాయకుడు ‘గురు గోవింద్ సింగ్’ మొదలుపెట్టారు.

కర్ణాటక రాష్ట్రంలో ‘బేదర వేషా’ అనే పేరుతో హోళీని  ఎంతో ప్రత్యేకంగా , ఐదు రోజుల పాటు జానపద కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ ఈ  వేడుకలు సంవత్సరం విడిచి సంవత్సరం జరుపుకుంటారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button