telugu facts

సినిమాలు కాకుండా టాలీవుడ్ హీరోల బిజినెస్ లు ఏంటో తెలుసా ?

అవకాశం ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలని ఎప్పుడు పెద్దవాళ్లు చెబుతూనే ఉంటారు… ఈ ఫార్ములాని ఇప్పుడు చాలామంది అనుసరిస్తున్నారు..
ముఖ్యంగా ఈ ట్రెండ్ ను ఎక్కువగా నటులు బాగా ఫాలో అవుతున్నారు…గత తరం నటులు పట్టించుకోకపోయినా… ఈ తరం నటులు తన అభిరుచులకు తగ్గట్టు వ్యాపారలు చేస్తూ లాభాలను రాబట్టు కుంటున్నారు… టాలీవుడ్లో ఏ నటులు ఏఎ వ్యాపారాలు చేస్తున్నారో తెలుసుకుందాం…

చిరంజీవి:-
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 151 పై సినిమాలు తీసిన ఏకైక నటుడు చిరంజీవి మాత్రమే… అలాంటి ఆయన క్రీడా రంగం కొరకు కేరళ బ్లాస్టర్స్ అనే ఓ సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు..

నాగార్జున:-
ఇటు సినిమాలలో నటిస్తూ, బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి రియాల్టీ షోలతో క్షణం తీరిక లేకుండా ఉండే అక్కినేని నాగార్జున కూడా చాలా వ్యాపారాలను నడిపిస్తున్నారు.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ లు ,రెస్టారెంట్లు వంటి వ్యాపారలో నాగార్జున చురుగ్గా రాణిస్తున్నారు….

మోహన్ బాబు:-

అప్పటి తరం వాళ్ళు మోహన్బాబు ఎవరంటే హీరో అని చెప్తారు… కానీ ఇప్పటి తరం వారు మోహన్ బాబు ఎవరంటే బిజినెస్ మ్యాన్ అని బల్లగుద్ది చెప్పారు… ఆంధ్రా, తెలంగాణలో ఉన్న శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను మోహన్ బాబు స్థాపించారు… మొదట ఈ శ్రీ విద్యానికేతన్ స్కూలు తిరుపతిలో ప్రారంభించగా …ఆ స్కూల్ కి భారీ స్పందన లభించడంతో. మరో నాలుగు బ్రాంచీలో ఓపెన్ చేశారు.

అల్లు అర్జున్:-
టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ తనకు డ్యాన్స్ తో పాటు వ్యాపారాలు చేయడం అంటే చాలా ఇష్టమని పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు ఈ మేరకు” 800 జూబ్లీ బార్ అండ్ పబ్” అనే రెస్టారెంట్ స్టైలిష్ స్టార్ కు చెందిందే… మీరు ఈ పబ్ ని జై లవకుశ సినిమాలో ప్రియదర్శి ఇచ్చే పార్టీ ఈ పబ్ లోనే షూటింగ్ చేశారు.

మహేష్ బాబు:-
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించడంతో పాటు ఇటీవలే “AMB సినిమాస్” అనే సొంత బ్యానర్ ను నిర్మించారు… ఈ మేరకు మహేష్ తన సంస్థ ద్వారా నిర్మాతగా అవతారం ఎత్తాడు…

సందీప్ కిషన్:-
ఇప్పుడున్న హీరోలలో సందీప్ కిషన్ సినిమాలపై ప్రేక్షకులు అంతగా ఆదరించక పోవడంతో… ఇటీవలే వివాహ భోజనంబు అనే కొత్త రెస్టారెంట్ ని హైదరాబాద్ లో సహా పలు బ్రాంచ్ లు స్థాపించి వ్యాపారంలో లాభాలు రాబట్టుకోవడంలో విజయం సాధించారు…

రాంచరణ్:-
మెగాస్టార్ చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్ సినిమాలతో బిజీగా ఉన్నా…. తనకు వ్యాపారంపై ఉన్న మక్కువతో ట్రూజెట్ అనే విమాన తయారీ సంస్థ లో భాగస్వామి అయ్యాడు..

ఇంకా దగ్గుపాటి రానా “CAA-KAWN” అనే కాఫీ కేఫ్ ని, శర్వానంద్ బీన్జ్: ది అర్బన్ కాఫీ విలేజ్” అనే కేఫ్ ని, నటుడు జగపతి బాబు “క్లిక్ సిని ఆర్ట్” అనే ఫిలిం ఇన్స్టిట్యూట్ ని, హీరో విజయ్ దేవరకొండ రౌడీ అనే ఫ్యాషన్ కాంప్లెక్స్ ని, మంచు విష్ణు “న్యూయార్క్ అకాడెమి” అనే ఇంటర్నేషనల్ స్కూల్ ని విజయవంతంగా నడుపుతున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button