health tips in telugu

రోజూ చికెన్ తింటున్నారా… అయితే ఈ విషయాలను మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

Do you eat chicken on a daily basis

ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతీ ఇంట్లో కోడికూర ఉండాల్సిందే … దీని వాసన తగిలితే గాని ఆ రోజు సండే లా అనిపించదు. వారం వారం అంటే చికన్ తింటే పర్లేదు కానీ రోజు మాంసం లేనిదే ముద్ద దిగనివారికి కొన్ని విషయాలు మీకు తెలపాలని అనుకుంటున్నాం. అదేంటంటే.. బయట దొరికే షాపులలో, సూపర్ మార్కెట్లలో అమ్మే చికెన్‌లో కొన్ని  హానికారక ‘ క్యాంపిలోబ్యాక్టర్ ‘ అనే వైరస్ ఉన్నట్టు ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. ఈ  బ్యాక్టీరియా అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు . రోగాల బారిన పడిన కోళ్లకు ఇచ్చే యాంటీ-బయోటిక్ మందుల వల్ల కూడా ఈ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతోందని పరిశోధనల్లో తేలింది . అందువల్ల చికెన్‌ను ఎక్కువగా తినేవారు కాస్త తగ్గించుకుంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 ఈ చికెన్ తగిన మోతాదులో తీస్కొని హెల్దీగా కూడా మారొచ్చు…అదెలాగంటే.. 

 ఎక్కువ మంది ప్రజలు చికెన్ బిర్యానీ, కర్రీస్‌, ఫ్రైలా చేసుకొని తినేబదులు …. నూనె తక్కువగా వేసి వండుకోవడం ఆరోగ్యానికి చాల మంచిది. ఎందుకంటే చికెన్ ను ఉడికించడం వలన  ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. చెప్పాలంటే కడ్డీలకు చిన్న ముక్కలను గాని, ఏకంగా కోడిని మొత్తం కు  కానీ   రెసిపీ లు పట్టించి కాల్చి తింటే ఇంకా మంచిది. ప్రతీసారి నూనెలో గోలిచ్చే బదులు , చికెన్‌లో నూనె గుణాలు ఉంటాయి కాబట్టి , దాన్ని కాస్తా వేడిచేస్తే ఆ నూనె బయటికొచ్చి చక్కగా ఉడికిపోతుంది. అలాగే ఎంతో రుచిగాను మారుతుంది.

ఇంకో పద్దతి ఏంటంటే… టోస్టర్‌లో బేక్ చేయడం,  దీంతో పాటు.. బేక్ చేస్తే ఉడకడంతో పాటు ఆయిల్‌ని వాడకుండా ఉండవచ్చు. మరో విషయం మీకు తెలియాలి అదేంటంటే , కోడి లోని లెగ్ భాగాన్ని ఎక్కువ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే కోడి పిల్లలు తొందరగా ఎదగడానికి వాటి లెగ్ భాగానికి ప్రమాదకరమైన ఇన్సులిన్ లు ఇస్తూ ఉంటారు.

కాబట్టి.. మీరు ఎంతగానో ఇష్టపడే చికెన్ ను  కాస్తా హెల్దీగా వండుకుని తినటం వలన మీకు, మీ ఇంట్లోవారికి ఆనందానికి ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూరుతుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button