Political News
పవన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నవేళ పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ సంచలనవ్యాఖ్యలు చేసారు.
తాజాగా ప్రకాష్ రాజ్ బీజేపీ పార్టీ నాయకులపై , అటు పవన్ పై నిప్పులు చెరిగారు.
కళ్యాణ్ బీజేపీ కి మద్దతూ పలకడాన్ని ప్రకాష్ జీర్ణించుకోలేక పోయాడు, ఈ సందర్భంలో ప్రకాష్ మాట్లాడుతూ జనసేన పార్టీకి అధినేత ఐన పవన్కళ్యాణ్ బీజేపీ మద్దతు పలకడం తనను ఎంతో బాధించిందని తెలిపాడు.
మతకల్లోలను రేపే పార్టీకి పవన్ మద్దతు పలకడం బాగాలేదని వెల్లడించాడు. ఇంతకముందు పవన్ బీజేపీ ని తిడుతూ , ఇపుడు పొగుడుతూ ఒక ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నాడని పవన్ ని నమ్మకండి అని వర్ణించాడు.
ఇలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అలాగే బీజేపీ నాయకులూ ప్రకాష్ రాజ్ వాక్యాలను ఖండిస్తున్నారు.