DJ Tillu Movie Review :-

Movie :- DJ Tillu (2022) Review
నటీనటులు :- సిద్ధూ జొన్నలగడ్డ , నేహా శెట్టి , ప్రిన్స్ , బ్రహ్మజి మొదలగు
నిర్మాత :- నాగ వంశీ
సంగీత దర్శకుడు :- శ్రిచరన్ పాకల
దర్శకుడు :- విమల్ కృష్ణ
Story ( Spoiler Free):-
ఈ కథ బాల గంగాధర తిలక్ అలియాస్ డి.జే.టిల్లు (సిద్ధూ జొన్నలగడ్డ) మాస్ ఎంట్రీ తో మొదలవుతుంది. టిల్లు లైఫ్ హ్యాపీ గా ఎంజాయ్ చేస్తుంటాడు. అలా ఒకానొక సమయంలో రాధిక ( నేహా శెట్టి) ని చూసి ప్రేమలో పడుతాడు. అంత సాఫీగా జరుగుతుంది అని అనుకునే లోపే రాధిక తన బాయ్ ఫ్రెండ్ ని మర్డర్ చేసిన సీన్ లో బుక్ అయ్యి ఎలాగైనా ఈ సమస్య నుంచి బయట పడేయి అని టిల్లు హెల్ప్ కోరుతుంది.
ఇప్పుడు టిల్లు ఇప్పుడు ఎం చేయబోతున్నాడు ? ఎలా రాధిక ని సమస్య నుంచి బయట పడేశాడు ? వీటన్నిటి మధ్య ప్రిన్స్ క్యారక్టర్ ఎలా ఉండబోతుంది ? టిల్లు మరియు రాధిక సెకండ్ హాఫ్ లో ఎలాంటి సన్నివేశాలను ఎదురుకున్నారు ? చివరికి ఎం జరిగింది అనేది మిగిలిన కథ.
Positives 👍:-
- సిద్ధూ జొన్నలగడ్డ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్. అతని డైలాగ్ డెలివరీ కానీ స్లాంగ్ కానీ యూత్ నీ విపరీతంగా అలరిస్తుంది. నేహా శెట్టి కూడా బాగా నటించింది. ప్రిన్స్ పర్ఫెక్ట్ .
- కథ మరియు మొదటి భాగం.
- సినిమాటోగ్రఫీ మరియు నిర్మాణ విలువలు.
- పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
Negatives 👎:-
- సిల్లీ ప్లాట్ ఎవరైన కథ అశించి వస్తే నిరాశ చెందుతారు.
- సెకండ్ హాఫ్.
Overall :-
మొత్తానికి డి. జే. టిల్లు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. సిద్ధూ జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి చాలా బాగా అలరిస్తారు. కామెడీ ట్రాక్స్ అందరిని బాగా నచ్చుతుంది.
దర్శకుడు ఎం చెప్పాలనుకున్నాడో అంతా కామెడీ రూపం లో బాగా చెప్పారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్ పైన ఇంకా బాగా దృష్టి పెట్టాల్సింది. మొత్తానికి ఈ. వారం కుటుంబం అంతా కలిసి ఓసారి ఈ సినిమాని చూడచ్చు.
Rating :- 2.75/5