Diwali Special Updates from Tollywood Biggie Films : దీపావళి కానుకగా టాలీవుడ్ సినిమాల అప్డేట్స్ :-

Diwali Special Updates from Tollywood Biggie Films : పండగ పూట ప్రతి సినీ ప్రేమికుడికి మరియు టాలీవుడ్ హీరోల అభిమానులకి పెద్ద పండగే అని చెప్పాలి. ఎందుకంటే వాలా ఫేవరెట్ హీరో చేయబోయే సినిమా కి సంబంధించి అప్డేట్స్ వస్తది. పండగకి అప్డేట్స్ వస్తే చాలు ఫ్యాన్స్ దిల్ కుష్ అయిపోతాది. అలాంటి ఫ్యాన్స్ కోసం ఈ దీపావళి కానుకగా ఎన్నో భారీ సినిమాలకి సంబందించిన అప్డేట్స్ రాబోతున్నాయి.
ముందుగా అడవి శేష్ నటిస్తున్న మేజర్ సినిమా కి సంబందించిన మేజర్ అనౌన్స్మెంట్ రాబోతుంది అని చిత్రబృందం అధికారిక ప్రకటన చేశారు. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా కి సంబందించిన భారీ అనౌన్స్మెంట్ ఉండబోతుంది అని వెల్లడించారు. టాక్ ఏంటంటే భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్త ఏమైనా చెప్తారేమో అని అభిమానులు భయపడుతున్నారు.
దీని తర్వాత బోయపాటి శ్రీను , బాలయ్య బాబు చేసిన అఖండ సినిమా కి సంబందించిన టైటిల్ సాంగ్ యొక్క టీజర్ విడుదల చేయబోతున్నారు. పోస్టర్ చూస్తేనే అభిమానులకు గూస్బంప్స్ వచ్చాయి అనుకోండి. వీటితోపాటు మెగా స్టార్ చిరంజీవి మరియు రాంచరణ్ కలిసి చేసిన ఆచార్య సినిమా లోని రెండవ పాట నీలాంబరి అనే లైన్ తో సాగె పాట విడుదల చేయబోతున్నారు.
దీనితర్వాత మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ చేయబోయే సినిమా సూపర్ మచ్చి సినిమా కి సంబందించిన మ్యూజికల్ టీజర్ విడుదల చేయబోతున్నారు. ఇంకా మిగితా చిత్రబృందాల నుంచి పోస్టర్స్ రావచ్చు.
వీటన్నిటిమధ్య పండగ నాడు రజిని పెద్దన్న , విశాల్ ఆర్య ఎనిమి , సంతోష్ శోభన్ మంచిరోజులొచ్చాయి థియేటర్ లో విడుదల కాబోతున్నాయి.