Diwali 2020 : ఏపీలోని ఈ గ్రామంలో 200 ఏళ్లుగా దీపావళిపై నిషేధం.. ఎందుకంటే..
Diwali 2020 : భారతదేశ సంస్కృతికి సాంప్రదాయాలో పండుగలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది… ముఖ్యంగా భారత దేశ ప్రజలు ఎంతో ఇష్టంతో దీప కాంతులతో చేసుకునే పండుగ దీపావళి … ఈ పండుగ ఎప్పుడు వస్తుందా అని చిన్నారులు వేచి చూస్తుంటారు… ఈ పండుగను దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు కానీ ఒకే ఒక్క గ్రామంలో మాత్రం దీపావళి పండుగ జరుపుకోరు….. ఇంకా దీపావళి పండుగ ఆ గ్రామాల్లో నిషేధించారు… ఆ గ్రామంలో ఎవరైనా దీపావళి పండుగ జరుపుకుంటే గ్రామ పెద్దలు కఠినమైన చర్యలు తీసుకుంటారు….అసలు ఆ ఊరు ఏంటి, ఎక్కడ ఉందో తెలుసుకుందాం…
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్ననపాలెం గ్రామంలో రెండు వందల ఏళ్లుగా దీపావళి పండగను జరుపుకోరు. ఎందుకంటే రెండు వందల సంవత్సరాల క్రితం దీపావళి ,నాగుల పంచమి ఒకేరోజు రావడంతో…ఒక చిన్న పాపా, అలాగే రెండు ఎద్దులు ఆ రోజే మరణించాయి… దీంతో అప్పటినుండి దీపావళి అంటే దుష్ట పండగ అని పున్ననపాలెం గ్రామస్తులు బలంగా నమ్ముతున్నారు…తరాలు గడుస్తున్నా గ్రామస్తులు ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు… అక్కడ ఉన్న యువకులు ఎంత చైతన్య పరిచిన గ్రామ పెద్దలు దీపాల పండుగ జరుపుకోవదని కరాఖండీగా ఉన్నారు… ఎవరైనా గ్రామస్తులు ఆ నియమాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు జరిమానాలు తీసుకుంటున్నారు…. ఇది చూసి పలువురు “ఇంకా మూడనమ్మకాలు ఏంటి అని తిట్టిపోస్తున్నారు…