Disappointing News for SRK fans : షారుక్ ఖాన్ ప్యాన్ ఇండియా సినిమా నిరశకరమైన అప్డేట్ ? :-

Disappointing News for SRK fans : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మరియు తమిళ డైరెక్టర్ అట్లీ కలిసి లయన్ అనే సినిమా ప్యాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార , ప్రియమణి నటిస్తున్నారని అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం.
అయితే షూటింగ్ అయితే కొద్దీ రోజుల క్రితం వరకు బాగానే జరిగినప్పటికీ షారుఖ్ ఖాన్ కొడుకు అయినా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు బయట పడినప్పటినుంచి షారుఖ్ ఖాన్ షూటింగ్ ఆపేసి పర్సనల్ లైఫ్ అండ్ కొడుకు కోసం కోర్ట్ మరియు జైలు చుట్టూ తిరిగారు. మొత్తానికి కొడుకు జైల్ నుంచి బయటకు వచ్చేసిన విషయం అందరికి తెలిసిందే.
అయితే షారుఖ్ ఖాన్ లేకపోతే షూటింగ్ ఎలా చేస్తాం అని అట్లీ కూడా షూటింగ్ కి లాంగ్ బ్రేక్ చెప్పెశారు. అయితే ఇక్కడ ఒక తిరకాసు ఉంది. షారుఖ్ ఖాన్ మరియు అట్లీ సినిమా కోసం లేడీ సూపర్ స్టార్ అయినా నయనతార అక్టోబర్ మరియు నవంబర్ నెలలు కాల్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దాని తర్వాత నయనతార తాను ఆల్రెడీ కమిట్ అయినా సినిమాల షూటింగ్స్ కి వెళ్ళిపోతుంది.
ఇపుడు ఇదివరకే షారుఖ్ మరియు నయనతార మధ్య షూట్ చేసిన సన్నివేశాలను ఎం చేయలేకపోతున్నారు చిత్రబృందం. ఇందులో నయనతార తప్పు కూడా లేదు తాను సినిమా కి ఇయాల్సిన డేట్స్ ఇచ్చేసింది కాకపోతే అనుకోని సంఘటనల ఎదురుకావడం తో చేసేదేం లేక సినిమా ఉంచి తప్పుకున్నట్లు చిత్రసీమలో టాక్ వినిపిస్తుంది.
అట్లీ మరియు టీం కూడా చేసేదేం లేక నయనతార కంటే పవర్ఫుల్ రోల్ చేయగలిగే మరో హీరోయిన్ కోసం వెతికే పనిలో పడినట్లు తెలుస్తుంది. ఈ వార్త ఎంతవరకు నిజం అనేది మల్లి షారుఖ్ అట్లీ సినిమా షూటింగ్ మొదలైనప్పుడే క్లారిటీ గా తెలుస్తుంది.
కానీ ఇప్పట్లో షూటింగ్ అయితే మొదలుపెట్టలేరు. ఒకవేళ నిజంగా నయనతార వాక్ అవుట్ అయితే మాత్రం సినిమా మీద ఉన్న ఇంపాక్ట్ కచ్చితంగా తగ్గినట్లే అనిపిస్తుంది. చూడాలి మరి ఎం జరుగుతుందో.