Director Shankar vs Aparichithudu : డైరెక్టర్ శంకర్ కి ఎనలేని కష్టాలు

Director Shankar vs Aparichithudu : మీరు చూసింది , మేము చెపింది నిజమే. ఈ మధ్యకాలంలో డైరెక్టర్ శంకర్ ఎం ముట్టుకున్నా , ఎం చేయాలనుకున్న అన్ని అడ్డంకులే. ఒకవేళ చేసిన మధ్యలో ఆపేయడమే జరుగుతున్నాయి. రోబో 2.O ప్లాప్ అయినప్పటి నుంచి ఈ కష్టాలు మొదలయ్యాయి.
2.O తర్వాత కమల్ హాసన్ తో ఇండియన్ 2 తియ్యాలని ప్లాన్ చేశారు. ఆల్రెడీ సగం షూటింగ్ కూడా అయిపొయింది , కానీ షూటింగ్ జరిగే సమయం లో ఎక్విప్మెంట్స్ కింద పది అసిస్టెంట్స్ చనిపోవడం, ఇంకా వేరే వేరే కారణాల చేత ఇంతవరకు రీషూట్ మొదలుపెట్టలేదు.
ఇదిలా ఉండగా శంకర్ ఇండియన్ 2 ని పక్కనబెట్టి బాలీవుడ్ లో ఎంట్రీ ఇయ్యలని రణవీర్ సింగ్ తో అపరిచితుడు 2 సీక్వెల్ ప్లాన్ చేశారు. అని సక్రమంగానే జరుగుతున్నాయి అని అనుకునే సమయానికి అపరిచితుడు ప్రొడ్యూసర్ అయినా రవిచంద్రన్ కేసు ఫైల్ చేశారు. ఆ సినిమా రైట్స్ తనతో ఉన్నయాని. కానీ ఆ కేసు చాల నిదానంగా నడుస్తుంది అని ఈసారి మద్రాస్ హై కోర్ట్ లో శంకర్ పైన మరియు హిందీ సినిమా నిర్మాత అయినా జయంతిలాల్ గూడా పైన కలిపి త్వరలో కేసు వేయబోతున్నడని మరో సరి సభాముకంగా తెలియచేశారు. ఇప్పటికి కూడా రవిచంద్రన్ గారు అపరిచితుడు రైట్స్ తనవే అని గుచ్చి గుచ్చి చెప్పారు.
ఇన్ని కేసుల మధ్య శంకర్ ,రాంచరణ్, దిల్ రాజు ల సినిమా అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఇంతకీ శంకర్ అనౌన్స్ చేసిన 3 సినిమాలలో ఏది తీయబోతున్నారు అని పక్కనపెడితే, కోర్ట్ ఎం తీర్పు చెప్పబోతుందో అని అందరు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
చూడాలి మరి శంకర్ కి ఈ కష్టాలన్నీ ఎపుడు తొలిగిపోతాయో.