Director sekhar reddy interview about 90ML movie which starring Karthikeya
ఆర్‌ఎక్స్100′ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన ’90 ఎం.ఎల్` రిలీజ్ డేట్ ఫిక్సయింది. డిసెంబర్ 5న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ చిత్రంతో శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘ఆర్ ఎక్స్100’ తో సంచలన విజయం సృష్టించిన కార్తికేయ క్రియేటివ్ వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నేహా సోలంకి కథానాయిక. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ని శ్రీ వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌కి సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర తో ఇంటర్వ్యూ…
ఆర్.ఎక్.100లో కార్తికేయను చూడగానే 90 ఎంఎల్ స్క్రిప్ట్ కి పక్కాగా సరిపోయే హీరో అనిపించింది. డిసెంబర్ 5న థియేటర్లలో సినిమా చూసిన వారు కూడా కార్తికేయకు టైలర్ మేడ్ కేరక్టర్ అని ఫిక్సవుతారు. రీసెంట్‌గా అజర్‌బైజాన్ లో మూడు పాటలను చిత్రీకరించాం. ఆ పాటలు సినిమాకు హైలైట్ అవుతాయి. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. యూత్‌ఫుల్‌గా సాగే సినిమా ఇది.
టైటిల్ 90ఎంఎల్ అని పెట్టడం వలన ఇది ఓ తాగుబోతుల చిత్రం లేదా ఆల్కహాల్ కి సంబంధించిన చిత్రం అనుకోవచ్చు. ఇది అలా కాదు. మందు ఖచ్చితంగా తాగాల్సిన అవసరం ఉన్న ఒక పేషెంట్ పాత్రను తీసుకొని సినిమా తీయడం జరిగింది. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీసిన కల్పిత కథ మాత్రమే.
ఈ చిత్రంలో హీరోకి ఆరోగ్య రీత్యా ఆల్కహాల్ తప్పనిసరి అని చెప్పడం జరిగింది. అంతేకాని సినిమాలో మద్యపానాన్ని ప్రోత్సహించేలా సన్నివేశాలు కానీ, కామెడీ సన్నివేశాలు కానీ తీయలేదు. 90ఎం ఎల్ కంప్లీట్ లవ్ స్టోరీ. టైటిల్ అలా పెడితే, మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కాదు.
కార్తీకేయ నటించిన గత చిత్రాలైన గుణ 369, ఆర్ఎక్స్ 100 లలో యాక్షన్ మరియు ఎమోషనల్ కోణంలోనే అతన్ని ఎక్కువగా చూపించడం జరిగింది. ఈ మూవీలో వాటితో పాటు కామెడీ కూడా కార్తీకేయ చేయడం జరిగింది. కార్తీక్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.