Director Maruthi 3 Roses Webseries : మారుతీ 3 రోజెస్ వెబ్ సిరీస్ :-

Director Maruthi 3 Roses Webseries : మారుతీ , ఈపేరు వినగానే ప్రేక్షకులందరికీ గుర్తొచ్చేది కామెడీ , సినిమా అంత ఎంటర్టైన్మెంట్. అలాంటి మారుతీ వరుస సినిమాలు లైన్ అప్ చేసుకొని దర్శకుడిగా బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవలే మారుతీ చెప్పినట్లు ‘ కొత్త తరం దర్శకులైన , నటులైన ఎవరైనా ప్రోత్సాహం కచ్చితంగా ఇస్తాను అని హామీ ఇచ్చారు ” ఇపుడు ఆ హామీ ని నిలబెట్టుకుంటున్నారు.
అయితే మారుతీ తాజాగా ఒక వెబ్ సిరీస్ చేశారని, ఆ సిరీస్ ఆహ లో త్వరలో విడుదల కూడా అవుతుందని తెలిసింది. ఆ సిరీస్ పేరే 3 రోజెస్. ఈ సిరీస్ ముగ్గురు అమ్మాయిల మధ్య తిరుగుతుందని పోస్టర్ చూడగానే తెలుస్తుంది. కాకపోతే ఈ సిరీస్ ని దర్శకత్వం వహించింది మాత్రం కొత్త దర్శకుడు మ్యాగీ. ఈ సిరీస్ కి కథ , కధనం , సూపర్ విజన్ చేసింది దర్శకుడు మారుతీ. ఈ సిరీస్ ని యస్.కే .యాన్ నిర్మించారు. త్వరలో ఈ సిరీస్ ఆహ లో విడుదల కాబోతుంది.
ఈ సిరీస్ మారుతీ గారి మొదటి సినిమా ఈరోజుల్లో మాదిరి ఫుల్ కామెడీ మరియు కాంటెంపరరీ ఇష్యూ మీద ఉండబోతుంది. చూడాలి మరి ఈ సిరీస్ మారుతీ గారు ఏ విధంగా రాశారో, దాని మ్యాగీ ఎలా దర్శకత్వం చేశారో.
అయితే మారుతీ గారు ప్రస్తుతం సంతోష్ శోభన్ తో తీసిన మంచి రోజులొచ్చాయి అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా వరుస సినిమాలతో మారుతీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.