Tollywood news in telugu
తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న దిల్ రాజు భార్య !

రానున్న రోజుల్లో ఓటిటి హావా నడవనుంది దీనికి తగ్గట్టుగానే దర్శకనిర్మాతలు కూడా డిఫరెంటుగా ఆలోచిస్తున్నారు. కరోనా వైరస్ పరిస్థితుల తర్వాత ఈ అభిప్రాయం మరింత పెరగటంతో బడా నిర్మాతలు, ప్రముఖ ప్రొడక్షన్స్ సంస్థలన్నీ ఓటీటీలపై దృష్టిసాధించాయి. తాజాగా టాలీవుడ్ బడా నిర్మాత దిల్‌రాజు సైతం ఓటీటీకి తగ్గ కథల కోసం వెతుకుతున్నాడు.
దిల్‌రాజు కోసం తన సతీమణి తేజస్వీని స్వయంగా ఓ కథను సిద్ధం చేశారని ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది . లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఆమె, కొత్త కథలపై దృష్టి పెట్టి …ఓటీటీకి అనుగుణంగా ఓ డిఫరెంట్ కథను దిల్ రాజుకు చెప్పినట్టు తెలుస్తుంది.
దిల్‌రాజు కథ నచ్చటంతో ఓ టీం కు తన భార్య రాసిన కథలను పరిశీలించామని చెప్పారట. దీంతో దిల్ రాజు భార్య తేజస్విని తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతునట్టు అర్థమవుతుంది.